నందగిరిహిల్స్‌లో భారీ చోరీ.. నేపాలీ గ్యాంగ్ పనే!

posted on: Feb 6, 2026 2:07PM

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి నందగిరి హిల్స్‌లోని ఓ ఇంట్లో  భారీ దోపిడీ జరిగింది.  ఆ ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారు.  చోరీకి గురైన సొత్తు విలువ 20 లక్షల రూపాయలకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. పోలీసులు సమాచారం మేరకు.. నందగిరి హిల్స్‌లోని ఓ ఇంట్లో రూ.20 లక్షలు విలువ చేసే బంగారం, డైమండ్స్ దొంగలు దోచుకున్నారు.   నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. . నందగిరి హిల్స్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు సీసీ టీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తున్నారు.  

దొంగలు తొలుత  ఆ ఇంటి వద్ద సెక్యూరిటీగా ఉన్న వాచ్‌మన్‌కు మత్తుమందు కలిపి ఇచ్చి అతడు  ఆపస్మారక స్థితిలోకి వెళ్లిన తరువాత  దొంగలు ఇంట్లోకి చొరబడి  లాకర్‌లోని బంగారు ఆభరణాలు మొత్తం దోచుకున్నారు. ఈ చోరీ  నేపాలీ గ్యాంగ్ పనేనని  పోలీసులు అనుమానిస్తున్నారు.  ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. దొంగల కదలికలను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

 దొంగలు నగరం విడిచి వెళ్లకుండా విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగరంలో నేపాలీ గ్యాంగ్‌ల సంచారం పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా పని మనుషులు, వాచ్‌మెన్‌లను నియమించే సమయంలో వారి ఆధార్ కార్డులు, పూర్తి వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమర్పించాలని పోలీసులు సూచిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...