ఎమ్మిగనూరు వద్ద రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
posted on: Nov 29, 2025 8:43AM

కర్నూలు జిల్లాలో శనివారం (నవంబర్ 30) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మృతులు కర్నాటకు చెందిన హోసపల్లికి చెందిన వారిగా గుర్తించారు. రెండు కార్లూ కూడా మితిమీరిన వేగంతో వెడుతున్నాయని ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాద తీవ్రత అధికమైందనీ అంటున్నారు. మృతులలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.
.............


.webp)



