కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఏపీ వాసులు మృతి
posted on: Feb 9, 2026 8:12AM
.webp)
కర్నాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఏపీ వాసులు దుర్మరణం పాలయ్యారు. చింతకాలు కోసే కూలీలుగా కర్నాటకకు వెళ్లిన ఏపీవాసులు తిరుగు ప్రయాణంలో ఉండగా కర్నాటకలోని కోలారు జిల్లా శ్రీనివాసపురం వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి బోల్తాపడటంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ దుర్ఘటనలో అన్నమయ్య జిల్లా రామ సముద్రం మండలం పూలకుంటవారి పల్లెకు చెందిన శ్రీనివాసులు, మునెన్ప, వెకటమ్మలు సంఘటనా స్థలంలోనే మరణించారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


.webp)
.webp)


