పొగమంచు కారణంగా ప్రమాదం.. తండ్రీ కొడుకులు మృతి
posted on: Feb 2, 2026 11:30AM
.webp)
పొగ మంచు కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకులు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద సంఘటన విదారక ఘటన వికారాబాద్ సమీపంలోని బుగ్గ రామేశ్వర ఆలయం వద్ద జరిగింది. వికారాబాద్ నుంచి బుగ్గ రామేశ్వరం వైపుగా ట్రక్కులో జేసీబీని తరలిస్తున్న ట్రక్కు బోల్తాపడింది. ఈ సంఘటనలో ట్రక్కుపై ఉన్న జేసీబీ ఈ సమయంలో అటుగా వెడుతున్న బైక్ వెడుతున్న తండ్రీ, కుమారులపై పడటంతో వారిద్దరూ మరణించారు.
దట్టమైన పొగమంచు కారణంగా ట్రక్కు డ్రైవర్‌కు ముందున్న రహదారి స్పష్టంగా కనిపించకపోవడంతో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ట్రక్కు పై ఉన్న జేసీబీ అదే సమ యంలో ఎదురుగా బైక్‌పై వస్తున్న తండ్రి లాలయ్య, అతని కుమారుడు రిత్విక్(8)పై పడింది. ఈ ప్రమాదంలో రిత్విక్ అక్కడిక్కడే మరణించగా, తండ్రి లాలయ్య తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సమయంలో మరో స్కూటీపై వస్తున్న లాలయ్య భార్య మేఘన, కూతురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.


.webp)



