Latest News

ఏపీలో ఆర్ఎంజడ్ పెట్టుబడులు లక్ష కోట్లు!

posted on: Jan 21, 2026 9:39AM

ఏపీలో లక్ష కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ఆర్ఎంజడ్ సంస్థ ముందుకు వచ్చింది. దావోస్ వేదికగా ఆర్ఎంజడ్ చైర్మన్ మనోజ్ మెండాతో ఏపీ మంత్రి నారాలోకేష్ మంగళవారం (జనవరి 20) జరిపిన చర్చలు ఫల ప్రదమయ్యాయి.  ఆంధ్రప్రదేశ్ లో రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో లక్ష ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆర్ఎంజెడ్ అంగీకరించింది.

 ప్రపంచస్థాయి సంస్థలను ఆకర్షించడం, విశాఖనగరంలో జీసీసీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా విశాఖపట్నం కాపులుప్పాడ ఫేజ్-1 ఐటీ పార్క్‌లో సుమారు 50 ఎకరాలలో 10 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో జీఈసీ పార్క్   పార్క్‌  అభివృద్ధికి ఆర్ఎంజడ్ తో ఒప్పందం కుదిరింది.  

మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఆర్ఎంజడ్ ఛైర్మన్ మనోజ్ మెండా ఈ వ్యూహాత్మక పెట్టుబడి భాగస్వామ్యాన్ని ప్రకటించారు.  రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక, లాజిస్టిక్స్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూనే, విశాఖపట్నాన్ని నెక్ట్స్ జెన్ మిక్స్డ్ యూజ్, డిజిటల్ మౌలిక సదుపాయాల కేంద్రంగా మార్చలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఆర్ఎంజడ్ ఈ పెట్టుబడులు పెట్టనుంది.  దీని ద్వారా ఐటీ, డేటా సెంటర్లు, పారిశ్రామిక, లాజిస్టిక్స్ రంగాలలో సుమారు లక్ష మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...