ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ మృతి

posted on: Jan 26, 2015 7:42PM

 

ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్(94) సోమవారం సాయంత్రం కన్నుమూశారు. గత కొంత కాలం అనారోగ్యంతో ఉన్న ఆయన పూణే నగరంలో దీననాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కానీ క్రమంగా పరిస్థితి విషమించి చివరికి ఈరోజు సాయంత్రం కన్నుమూసారు. ఆర్కే లక్ష్మన్ అనగానే మొట్ట మొదట గుర్తుకు వచ్చేది ఆయన సృష్టించిన కామన్ మ్యాన్ చిత్రమే. ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ లో ఆయన దాదాపు ఐదు దశాబ్డాలపాటు ‘ది కామన్ మేన్’ ‘యూ సెడిట్’ పేరిట సమకాలీన రాజకీయాలపై గీసిన రాజకీయ వ్యంగ చిత్రాలు యావత్ భారతావనిలో ప్రజలను ఎంతగానో ఆకర్షించాయి. ఆయన స్పూర్తితో ఎంతో మంది రాజకీయ కార్టూనిస్టులుగా పత్రికా రంగంలో ప్రవేశించారు కూడా. ఆయన భార్య కమల మంచి రచయిత్రిగా పేరు సంపాదించుకోగా, వారి కుమారుడు శ్రీనివాస్ జర్నలిస్టుగా పనిచేసారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...