ర్యాంకుల వేటలో పెరుగుతున్న ఆత్మహత్యలు

posted on: Apr 23, 2026 3:12PM

భారతదేశంలోని ప్రతిష్ఠాత్మక క్యాంపసులు ఇప్పుడు కేవలం విద్యా స్థలాలు మాత్రమే కాక, కొందరికి జీవన పోరాట వేదికలుగా మారుతున్నాయి. విద్యార్థుల ఆత్మహత్యలపై వస్తున్న తాజా గణాంకాలు..  ఆందోళన కలిగిస్తున్నాయి. ఏదైనా సంఘటన జరిగిప్పుడు మాత్రమే క్యాంపస్ లలొ లోని మానసిక ఆరోగ్య సంక్షోభంపై చర్చ జరుగుతోంది. 2011లో 6,654గా ఉన్న విద్యార్థుల ఆత్మహత్యలు 2023 నాటికి 13,044కి పెరిగినట్లు వచ్చిన నివేదికలు ఈ విషాదాన్ని స్పష్టంగా చూపుతున్నాయి. ప్రతిసారీ ఒక విద్యార్థి చనిపోతాడు.   మనం బాధపడతాం. తరువాత మళ్ళీ  సాధారణం. ఇది అసలైన ప్రమాదం. 

తాజా నివేదికల ప్రకారం, దేశంలో విద్యార్థుల ఆత్మహత్యల రేటు జనాభా వృద్ధి రేటును మించి పెరుగుతోంది. ఐసీ3 నివేదిక ఆధారంగా 0–24 ఏళ్ల వయసు జనాభా దాదాపు స్థిరంగా ఉండగా.. విద్యార్థుల ఆత్మహత్యలు మాత్రం రెట్టింపుకి చేరుకున్నాయి. 2022–23లో విద్యార్థుల ఆత్మహత్యలు సగటున ఏటా నాలుగు శాతం చొప్పున పెరిగాయి.  అదే సమయంలో మొత్తం ఆత్మహత్యల రేటు 2శాతం పెరిగింది.  
ఐఐటీ, జేఈఈ, నిట్ ఆశావహులపై జరిగిన తాజా అధ్యయనం కూడా ఆందోళన కలిగిస్తోంది. ఆ అధ్యయనం ప్రకారం 81శాతం  కేసులు 15–20 ఏళ్ల వయసులోనే చోటుచేసుకోగా, 73శాతం నీటి ఆశావహులకు చెందినవే.   రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
 
 ఎలిట్య్ విద్యాసంస్థల్లో చేరడం ఒక విజయంగా ప్రారంభమవుతుంది..  కానీ అక్కడికి చేరాక ఫన్నెల్ ముగియదు. జీఈఈ పరీక్షకు 13 లక్షలకుపైగా అభ్యర్థులు హాజరవుతారు. సీట్లు మాత్రం అతి కొద్దిమందికే దక్కుతాయి. ఆ తరువాత క్యాంపస్ లో గ్రేడ్స్, బెల్ కర్వ్స్, షార్ట్ లిస్టులు, ప్లేస్మెంట్లు, పబ్లికేషన్లు అన్నీ మరో ఫన్నెల్గా మారతాయి. ఈ నిరంతర ఎంపికల వ్యవస్థ విద్యార్థి విలువను ప్రదర్శనకు కుదించి,  వ్యక్తిత్వాన్ని విస్మరిస్తుంది. 

ఈ సందర్భంలో ర్యాంకు ఒక లక్ష్యం కాదు.. గుర్తింపుగా సమస్యగా మారుతుంది. పదమూడు ఏళ్ల వయసులోనే జేఈఈ చేయాలి అనే సందేశం బాల్యాన్ని ముందుగానే ముగిస్తుంది. దాని తరువాత వస్తున్న జీవితాన్ని ఎలా జీవించాలో మాత్రం ఎవ్వరూ నేర్పరు. ఫలితంగా, అడ్మిషన్  తర్వాత కలిగే శూన్యత, అపరాధ భావం, వెనుకబడిపోతానేమోనన్న భయం ఇవన్నీ కలిసి కలిసి మానసిక కృంగుబాటుగా మారతాయి. 

 మెరిట్క్రసీ  అనే మాట ప్రతిష్ఠాత్మకంగా వినిపించినా, అది అందరికీ సమాన అవకాశాలు ఇచ్చే వ్యవస్థగా ఉండదు. సామాజిక వివక్ష, కులం, , బహిష్కరణ  అంతరం.. ఇలా అందరినీ ఒకే పరీక్ష కింద కొలవడం అన్యాయం. విద్యార్థులు బయటకు విశ్వాసం  చూపుతారు కానీ లోపల మాత్రం అపరాధభావం, భయం, అవమానం, ఒంటరితనంతో పోరాడుతారు. ప్రభుత్వ నివేదికలు కూడా విద్యా ఒత్తిడి,   మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని చెబుతున్నాయి. అందువల్ల  మెరిట్ పేరుతో నడిచే ఒత్తిడి నిజానికి చాలామందికి  మనుగడ పరీక్షగా మారుతోంది.

రీసెర్చ్ స్కాలర్ల సమస్య మరింత గాఢంగా ఉంది. ఒక పర్యవేక్షకుడి చేతిలో అంశం, కాలం, నిధులు, సిద్ధాంత గ్రంథం, ప్రచురణ, చివరకు భవిష్యత్తు కూడా కేంద్రీకృతమవడం వల్ల ఇది మార్గదర్శకత్వం కంటే ఆధారపడటంగా మారుతోంది. పరిశోధనలో స్వతంత్రత కనపడాల్సిన చోట.. అనుమతి కోసం ఎదురుచూడడం, నిర్ణయాల కోసం భయపడడం, బయటకు వెళ్లే మార్గం లేకపోవడం సాధారణ మవుతోంది. ఇలాంటి వ్యవస్థలో విద్యార్థి వయసు 30 అయినా ఆర్థికంగా, విద్యాపరంగా, మానసికంగా అతి సున్నితంగా ఉంటాడు. ఇది విద్యార్థి  అనిశ్చితిని పెంచే దశగా మారుతున్నది. 

క్యాంపస్లలో ల్యాబ్లు, లైబ్రరీలు, ర్యాంకులు ఉన్నాయి.. కానీ మానసిక ఆరోగ్యానికి స్థలం చాలా తక్కువ. కొన్ని చోట్ల వందలాది లేదా వేలాది విద్యార్థులకు ఒక సలహాదారు మాత్రమే ఉంటారు. మరికొన్ని చోట్ల అసలు కౌన్సెలర్లే లేరు.   సమస్యక్యాంపస్ సంస్కృతి . ఇక్కడ సహాయం కోరడం బలహీనతగా, పోరాటాన్నిఅవమానంగా, గా, సమకాలీడుని లేదా సహ విద్యార్థిని పోటీదారుగా చూసే వాతావరణం..విద్యార్థిని మౌనమునిగా మార్చేస్తున్నది. అర్ధరాత్రి హాస్టల్ గదిలో ఒంటరిగా కూర్చునే విద్యార్థి తరచుగా తల్లిదండ్రులకు ఫోన్ చేయడు. వారు తన కోసం చేసిన త్యాగం గుర్తొస్తుంది. తాను విఫలమైతే కుటుంబం మళ్లీ దెబ్బతింటుందేమోనని భయం. ఈ భయమే చాలాసార్లు నిశ్శబ్దాన్ని ఎంచుకునేలా చేస్తుంది. 

ఈ సంక్షోభానికి ఒకే పరిష్కారం లేదు. కానీ కొన్ని స్పష్టమైన మార్గాలు ఉన్నాయి.. అవి   కౌన్సెలింగ్ వ్యవస్థ, అధ్యాపక శిక్షణ, ముందస్తు హెచ్చరిక యంత్రాంగాలు, సహచర మద్దతు బృందాలు, సమ్మిళిత తరగతి వాతావరణం, మరింత సరళమైన మూల్యాంకన నమూనాలు. కేంద్ర విద్యాశాఖ కూడా విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై కార్యాచరణ ప్రణాళిక అవసరమని గుర్తించినట్లు అధికారిక నివేదికలు సూచిస్తున్నాయి.

ఇక ర్యాంకింగ్‌లు, ప్యాకేజీలు, పేటెంట్లు మాత్రమే విజయం కాదు.. విద్యార్థి బతికి ఉండడం, సమర్థంగా ఎదగడం, ఒంటరితనాన్ని అధిగమించడం కూడా విద్యా విజయమే. అదే నిజమైన ప్రపంచస్థాయి విద్యా వ్యవస్థకు ప్రమాణం.

భారతదేశం తన ప్రతిభతో ప్రపంచానికి ఆప్యాయంగా కనిపించాలంటే..  ముందుగా   పిల్లలను కాపాడుకోవాలి. క్యాంపస్ లు ఉత్పత్తి కర్మాగారాలు మాత్రమే కాదు; అవి మానవ ఆవాసాలు కూడా. అక్కడ మనం ఏది కొలుస్తున్నామో కాదు, ఏది కోల్పోతున్నామో ప్రశ్నించాల్సిన సమయం ఇది.  విద్యార్థులు  ఎవరిని మించడానికి పోటీ పడుతున్నారు? అన్నదే ప్రధాన ప్రశ్న.

సంకలనం, సేకరణ : సీతారాం కంఠంనేని

References:
1. https://telugu.samayam.com/latest-news/india-news/ic3-report-says-indian-students-suicide-rate-surpasses-population-growthrate/articleshow/112885790.cms 
2.    https://pmc.ncbi.nlm.nih.gov/articles/PMC12256035/ 
3.    https://aadabhyderabad.in/mental-health-of-students-a-fundamental-right/ 
4.    https://www.andhrajyothy.com/2024/national/huge-increase-in-student-suicides-student-suicides-in-the-country-1303063.html 
5.    https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1909165 
6.    https://ntvtelugu.com/news/increasing-student-suicides-in-the-country-ic3-sensational-report-664332.html 
7.    https://tv9telugu.com/career-jobs/here-are-5-key-lifestyle-tips-that-can-help-promote-mental-health-among-school-students-1419238.html 
8.    https://telugu.abplive.com/crime/student-suicide-rate-surpasses-population-growth-rate-in-india-177554 
9.    https://www.prajatantranews.com/mental-health-of-students-a-fundamental-right/ 
10.    https://www.v6velugu.com/student-suicides-now-exceed-population-growth-rate-in-india-report 
 

google-ad-img
    Related Sigment News
    • Loading...