Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ట్రంప్ టారిఫ్ లపై అమెరికాలో రివోల్ట్.!
posted on: Aug 4, 2026 11:08AM

అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ కు సొంత దేశంలోనే చుక్కెదురైంది. ఆయన తీసుకున్న టారిఫ్ ల నిర్ణయానికి వ్యతిరేకంగా అమెరికాలోనే తిరుగుబాటు మొదలైంది. ప్రపంచ వ్యాపార రంగాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న ట్రంప్ టారిఫ్ టెర్రర్ కు వ్యతిరేకంగా అమెరికాలోని పాతిక రాష్ట్రాలలో వ్యతిరేక గళం బలంగా వినిపిస్తోంది. డెమోక్రటిక్ పార్టీ నేతృత్వంలోని పాతిక రాష్ట్రాల కూటమి ట్రంప్ ప్రభుత్వం చట్టబద్ధమైన అధికార పరిమితులను దాటి వ్యవహరిస్తోందంటూ.. అమెరికా కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్' లో పిటిషన్‌ను దాఖలు చేశాయి. అధ్యక్షుడు తన పరిధికి మించి తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం వల్ల స్వదేశీ ఆర్థిక వ్యవస్థకే తీవ్ర విఘాతం కలుగుతుందని రాష్ట్రాలు పిటిషన్ లో పేర్కొన్నాయి.
ట్రంప్ సర్కార్ భారత్ సహా దాదాపు 60 వాణిజ్య భాగస్వామ్య దేశాల నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై 10 శాతం నుండి 12.5 శాతం వరకు కొత్త సుంకాలను మోపింది. భారత్‌పై ప్రారంభంలో ఏకంగా 12.5 శాతం టారిఫ్ విధించాలని ప్రతిపాదించినప్పటికీ.. వెట్టి చాకిరీ నిరోధక చట్టాల అమలును భారత్ వేగవంతం చేయడంతో ఆ పన్నును 10 శాతానికి తగ్గించింది. అయితే చమురు, సహజ వాయువు, ఎరువుల దిగుమతులతో పాటు యుఎస్, మెక్సికో, కెనడా ఉమ్మడి వాణిజ్య ఒప్పందం పరిధిలోకి వచ్చే సరుకులకు మాత్రం ఈ నూతన పన్నుల నుండి ప్రత్యేక మినహాయింపుని ఇచ్చింది.
అయితే.. ఈ టారిఫ్ ల వల్ల స్థానిక వ్యాపారాలు, సామాన్య వినియోగదారులు తీవ్రంగా నష్టపోతారని 25 రాష్ట్రాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చే వస్తువులపై భారీ పన్నులు వేయడం వల్ల అంతిమంగా ఆ భారం అమెరికా పౌరుల జేబులపైనే పడుతుందని, నిత్యావసర ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటుతాయని ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న అమెరికా వినియోగదారులపై ఇది మరింత ఆర్థిక భారాన్ని మోపుతుందని, వ్యాపార సంస్థల సరఫరా వ్యవస్థలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం చట్టబద్ధమైన అధికా రాలను దాటి వ్యాపార రంగాన్ని సంక్షోభంలోకి నెడుతోందని డెమోక్రటిక్ రాష్ట్రాలు తమ పిటిషన్ లో పేర్కొన్నాయి.
Trump new tariffs, 25 US states oppose Trump, US Court of International Trade, Telugu One






