Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వలసదారులను పరుగులు పెట్టిస్తున్న రివర్స్ ఎక్సోడస్
posted on: Jun 4, 2026 5:33PM

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బంగ్లాదేశ్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపింది. రేషన్ కార్డుల రద్దు, జరిమానాలతో సరిహద్దుల్లో కఠిన చర్యలు చేపట్టింది. అదే రివర్స్ ఎక్సోడస్. పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో రివర్స్ ఎక్సోడస్ అనేది అక్రమ వలసలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, జాతీయ భద్రత అంశాల చుట్టూ తిరుగుతున్న ఒక కీలకమైన పరిణామం. స్థానిక ప్రభుత్వం తీసుకువచ్చిన కఠినమైన విధానం. కొత్త నిర్బంధ కేంద్రాల ఏర్పాటుతో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులు స్వచ్ఛందంగా స్వదేశానికి పరుగులు తీస్తున్నారు.
అక్కడి ప్రభుత్వం అక్రమ వలసదారులను గుర్తించి, తొలగించి, పంపే ప్రక్రియ పకడ్బందీగా అమలు చేస్తోంది. ఈ రివర్స్ ఎక్సోడస్ తో ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హకీంపుర్, మాల్డా, ముర్షిదాబాద్ వంటి సరిహద్దు ప్రాంతాల గుండా వందలాది మంది అక్రమ వలసదారులు బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లేందుకు క్యూ కట్టారు. ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు లేకుండా బీఎస్ఎఫ్అధికారులకు స్వచ్ఛందంగా లొంగిపోయి, తమ దేశానికి వెళ్లిపోవడానికి వారు సిద్ధపడుతున్నారు.
దశాబ్దాలుగా సరిహద్దుల గుండా జరుగుతున్న అక్రమ చొరబాట్లు బెంగాల్ జనాభా కూర్పును ప్రమాదంలో పడేశాయని నిపుణులు, జాతీయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దు భద్రత బలహీనపడటం.. దేశ భద్రతకు ముప్పు వాటిల్లడం వంటి తీవ్రమైన సమస్యలు దీనివల్ల ఉత్పన్నమవుతున్నాయి. ఈ అక్రమ వలసలను గతంలో కొన్ని రాజకీయ పార్టీలు జాతీయ భద్రత సమస్యగా చూడకుండా, తమకు అనుకూలమైన ఓటు బ్యాంకుగా వాడుకున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఓటర్ల జాబితా సవరణ(ఎస్ఐఆర్), కఠినమైన డాక్యుమెంట్ వెరిఫికేషన్ డ్రైవ్స్ చేపట్టడంతో, ఈ అక్రమ ఓటు బ్యాంకుల వ్యవస్థకు గండి పడుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు కొత్త విధానం ప్రకారం, అక్రమ చొరబాటుదారులను పట్టుకోవడానికి మాల్డా, ముర్షిదాబాద్ వంటి జిల్లాల్లో హోల్డింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. పట్టుబడిన వారిని కోర్టులకు పంపి సుదీర్ఘ ప్రక్రియ చేపట్టకుండా, నేరుగా బీఎస్ఎఫ్ అధికారులకు అప్పగించి సరిహద్దులు దాటించే ప్రక్రియను వేగవంతం చేశారు.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.


.webp)
.webp)


