అయ్యో రేవంత్.. ఎంత కష్టమొచ్చింది..
posted on: Nov 24, 2017 12:35PM
.jpg)
ఎంత ఫాస్ట్ గా పార్టీ మారీ.. ఎంత హడావుడి చేశాడో ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టు తయారైంది. ఏదో అయిపోయినట్టే.. టీడీపీ పార్టీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఇంకేముంది కాంగ్రెస్ పార్టీలో తనదే హవా అంతా.. నేను చెప్పిందే వేదం అన్నట్టు నేతలు నా మాట వింటారు అని అనుకున్నాడు. కానీ మొత్తం రివర్స్ కొట్టింది. నిన్న మొన్నటి వరకూ కొడంగల్ లో తానే గెలుస్తానని ధీమాతో ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు భయపడుతున్నాడట. అందుకే రాజీనామా లేఖ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వకుండా తిరుగుతున్నాడు. ఆయన రాజీనామా లేఖపై తాజాగా వివాదం చెలరేగిన సంగతి తెలసిందే కదా. అయితే ఇప్పుడు మరో కొత్త ట్విస్ట్ నెలకొంది.
అదేంటంటే.. రేవంత్ రెడ్డి తన రాజీనామా లేఖను చంద్రబాబుకు ఇచ్చానని చెప్పిన సంగతి తెలిసిందే కదా. అయితే టీటీడీపీ నాయకులు మాత్రం ఇవ్వలేదని చెబుతున్నారు. దీంతో ఇప్పుడు చర్చంతా రేవంత్ రెడ్డి రాజీనామా లేఖపైనే నడుస్తోంది. అంతేకాదు రాజీనామా లేఖ విషయంలో రేవంత్ రెడ్డి డబల్ గేమ్ కూడా ఆడుతున్నాడని అంటున్నారు టీఆర్ఎస్ నేతలు. ఎందుకంటే.. రేవంత్ తన రాజీనామా లేఖను చంద్రబాబుకు ఇచ్చానని చెబుతుంటే... టీ టీడీపీ అధ్యక్షుడు రమణ మాత్రం ఇవ్వలేదని అంటున్నాడు. రేవంత్ కూడా రాజీనామా మీద క్లారిటీ ఇవ్వడం లేదు. తనకు భీ ఫారం ఇచ్చిన చంద్రబాబు నాయుడికి రాజీనామా సమర్పించాలని... ఎమ్మెల్యేగా తనకు ప్రభుత్వం కల్పిస్తున్నా అన్ని వసతులను రద్దు చేసుకోవాలని స్పీకర్ కు లేఖ కూడా రాశాడు.
ఇదిలా ఉంటే... స్పీకర్ కు రాజీనామా లేఖ ఇస్తే తప్ప రాజీనామా అమోదం కాదు. రాజీనామ ఆమోదం తర్వాతే వసతుల ఉపసంహరణ అనేది ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. కానీ అలా కాకుండా ఎన్ని లేఖలు రాసినా వసతుల ఉపసంహరణ జరగదు. ఇది తెలిసే రేవంత్ మైండ్ గేమ్ ఆడుతున్నడని టీఆర్ఎస్ చెప్తోంది. నిజంగా రేవంత్ కు చిత్తశుద్ది ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఇలా చేయడం వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దల నుండి గ్రీన్ సిగ్నల్ రాకపోవడం వల్లే రేవంత్ ఎటూ తేల్చుకోలేకపోతున్నాడని అంటున్నారు. కొడంగల్ లో గెలుపు రేవంత్ కు అంత సులువు కాదని..రేవంత్ ఓడిపోతే అది కాంగ్రెస్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుందని జంకుతున్నారట. దీంతో ఒకపక్క టీఆర్ఎస్ నేతల నుండి ఒత్తిడి.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆదేశాలతో రేవంత్ రెడ్డి అయోమయ స్థితిలో పడ్డాడట. మొత్తానికి రెండు రోజులు హడావుడి చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ముందు ముందు ఇంకెన్ని విషయాల్లో తగ్గాల్సి వస్తుందో చూద్దాం....






.webp)



