రేవంత్ రెడ్డి సీట్ల సర్దుబాటు.. చంద్రబాబు కంటే మొండిగా రేవంత్ రెడ్డి..!

posted on: Jan 18, 2016 5:25PM

తెలంగాణ టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తన మాట ఎంత ఖచ్చితంగా ఉంటుందో.. తను అనుకున్నది సాధించేవరకూ అంతే మొండిగా ఉంటాడు. గ్రేటర్ ఎన్నికల్లో ఇది ఇంకోసారి నిజం చేశాడు రేవంత్ రెడ్డి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మిత్రపక్షాలైన బీజేపీ-టీడీపీలు సీట్ల సర్దుబాటు విజయవంతంగా అయిందని అందరికి తెలిసిందే. మొత్తం 150 డివిజన్లలో 90 స్థానాల్లో టీడీపీ.. 60 స్థానాల్లో బీజేపీ పోటీ చేసేందుకు గాను ఒప్పందం కుదిరింది.

అయితే ఇక్కడి వరకూ బానే ఉన్న అసలు ఉన్న మొత్తం డివిజన్లలో సగం సీట్లు తమకు కావాలని బీజేపీ మొదట పట్టు పట్టిందంట. కానీ దీనికి రేవంత్ రెడ్డి ససేమిరా ఒప్పుకోలేదంట. మొదట్నుంచి టీఆర్ఎస్ పై విజయం సాధించాలని చూస్తున్న రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని టీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాలని చూస్తున్నారు. అందుకే సీట్ల సర్దుబాటు విషయంలో చాలా మొండిగా వ్యవహరించారంట. ఒకవేళ బీజేపీకి కనుక అడిగిన సీట్లు ఇస్తే తాను వేరే దారి చూసుకోవాల్సి వస్తుందని.. ఎక్కువ సీట్లు బీజేపీకి ఇవ్వడం ద్వారా… టీడీపీ కేడర్ ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతుందని… అప్పుడు తమలాంటి నేతలు పార్టీని నమ్ముకుని ఉన్నా పెద్ద ప్రయోజనం ఉండదని రేవంత్ రెడ్డి పార్టీ చంద్రబాబుకే కుండబద్దలు కొట్టినట్టు చెప్పారంట. అంతేకాదు ఉన్న 150 డివిజన్లలో ఏ స్థానం నుండి బీజేపీ చేయాలని.. ఏ స్థానం నుండి టీడీపీ పోటీ చేయాలని అనేది కూడా రేవంత్ రెడ్డే డిసైడ్ చేశారంట. అంతేకాదు ఇదే విషయంపై బీజేపీ నేతలు కూడా మాట్లాడుతూ సీట్ల సర్దుబాటు విషయంలో చంద్రబాబు కంటే ఎక్కువగా రేవంత్ మొండిగా వ్యవహరించాడని.. లేకపోతే తమకు మరిన్ని సీట్లలో పోటీ చేసే అవకాశం దక్కేదని బీజేపీ నేతలు ఆఫ్ ది రికార్డ్ అన్నట్టు టాక్. మొత్తానికి ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి అనుకున్నది సాధించారు. మరి సీట్లు సర్దుబాటులో సక్సెస్ అయిన రేవంత్ రెడ్డి.. గెలుపు విషయంలో సక్సెస్ అవుతారో లేదో చూడాలి.

google-ad-img
    Related Sigment News
    • Loading...