పాఠాలు నేర్చుకుని సర్టిఫికేట్ తీసుకున్న సీఎం రేవంత్

posted on: Jan 30, 2026 10:02AM

తెలంగాణ ముఖ్యమంత్రి   రేవంత్ రెడ్డి మరో అరుదైన మైలురాయిని చేరుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ కెన్నడీ స్కూల్‌లో ఆయన విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు.  ఈ నెల 25 నుంచి 30 (శుక్రవారం) వరకు జరిగిన ‘లీడర్‌షిప్‌ ఫర్‌ ది ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ అనే ప్రత్యేక కోర్సులో రేవంత్ రెడ్డి విద్యార్థిగా తరగతులకు హాజరయ్యారు.

శిక్షణ ముగిసిన తరువాత  రేవంత్ రెడ్డికి యూనివర్సిటీ అధికారులు సర్టిఫికెట్‌అందజేశారు. తన శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకుని సర్టిఫికెట్ తీసుకున్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా పంచుకున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...