Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...డిజిటల్ అరెస్టు అంటూ రూ.1.66 కోట్లు స్వాహా.. సైబర్ నేరగాళ్ల వలలో రిటైర్డ్ జడ్జి
posted on: Mar 9, 2026 12:20PM
.webp)
హైదరాబాద్‌లో ఓ రిటైర్డ్ జడ్జి సైబర్ మోసానికి గురై భారీగా డబ్బులు కోల్పోయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే హైదరాబాద్‌కు చెందిన ఓ రిటైర్డ్ జడ్జికి సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేసి తాము సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులమని పరిచయం చేసుకున్నారు. మనీ లాండరింగ్ , మానవ అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయంటూ తీవ్రంగా భయ పెట్టారు. కేసు విచారణలో భాగంగా మీ బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాలని, మీరు చెల్లించే మొత్తం విచారణ పూర్త య్యాక తిరిగి అందజేస్తా మని నమ్మబలికారు. అరెస్టు జరిగితే తన ప్రతిష్టకుభంగం వాటిల్లుతుందనే భయంతో రిటైర్డ్ జడ్జి నిందితులు చెప్పిన విధంగానే విడతల వారీగా మొత్తం రూ.1.66 కోట్లు వారి ఖాతాలకు బదిలీ చేశారు.
ఆ నగదు తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయినట్లుగా గుర్తించిన రిటైర్డ్ జడ్జి పోలీసులను ఆశ్రయించారు. మీరు ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్ లో ఉన్నట్లేనని చెబుతూ ఇంటి నుంచి బయటకు రావొద్దని కట్టడి చేశారు. ఆయనకు సంబంధించిన ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న రెండు మొబైల్ నెంబర్ల ద్వారా మహిళలకు అభ్యం తరకర కాల్స్ వెళ్తున్నాయని బెదరించారు. బెంగళూరులోని ఇందిరానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మీపై కేసు నమో దైందని చెప్పి రిటైర్డ్ జడ్జిని మరింతగా భయపెట్టారు. అదే సమయంలో మీపై మానవ అక్రమ రవాణా కేసు కూడా నమోదైందని, ఈ కేసులో సుప్రీం కోర్ట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందని ఫోన్ ద్వారా బెదిరింపులకు గురి చేశారు.
ఈ విషయం గురించి కుటుంబ సభ్యులతో గానీ, స్నేహితులతో గానీ ఎలాంటి చర్చ చేయవద్దని కూడా నిందితులు కఠినంగా హెచ్చరించారు. కేసు విచారణలో భాగంగా మీ బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాలని, మీరు చెల్లించే మొత్తం విచారణ పూర్త య్యాక తిరిగి అందజేస్తా మని నమ్మబలికారు. అరెస్టు జరిగితే తన ప్రతిష్టకుభంగం వాటిల్లుతుందనే భయంతో రిటైర్డ్ జడ్జి నిందితులు చెప్పిన విధంగానే విడతల వారీగా మొత్తం రూ.1.66 కోట్లు వారి ఖాతాలకు బదిలీ చేశారు. ఈ ఘటనపై నేరేడ్ మెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ నేరగాళ్లను గుర్తించి పట్టుకు నేందుకు ప్రత్యేక దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.


.webp)



