Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాజన్ తర్వాత ఎవరు..?
posted on: Jun 20, 2016 1:21PM

రఘురామ్ రాజన్ రెండవసారి పదవిలో కొనసాగుతారా..? లేదంటే ప్రధాని ఆయన్ను తప్పిస్తున్నారా..? అంటూ మీడియాలోనూ, ఆర్ధిక రంగంలోనూ రకరకాల వాదనలు వినిపిస్తున్న తరుణంలో.. తన పదవి కాలం ముగిసిన తర్వాత రెండవసారి ఆర్‌బీఐ గవర్నర్‌గా కొనసాగనని రఘురాం రాజన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాజన్ తర్వాత తదుపరి గవర్నర్‌గా ఎవరిని నియమిస్తారా..? అంటూ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. సెప్టెంబర్ 4కు ముందే రాజన్ తదనంతరం ఎవరిని నియమిస్తామో త్వరలోనే ప్రకటిస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లి ప్రకటించారు. రాజన్ ప్రకటన నేపథ్యంలో అత్యున్నత స్థాయి అధికారులు ఉండే ఆర్ధిక రంగ నియంత్రణాధికారుల నియామకం, పరిశోధనా కమిటీ, అర్హత కలిగిన వారి జాబితా సిద్ధం చేస్తుంది. ఈ జాబితాలో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి.
ప్రస్తుత ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్, మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య, ముఖ్య సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, ప్రపంచ బ్యాంక్ ఆర్థికవేత్త కౌశిక్ బసు, ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్‌లలో ఒకరికి అవకాశం ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు బ్రింక్స్ బ్యాంక్ అధినేత కేవీ కామత్, ఆర్ధిక మంత్రి మాజీ సలహాదారు పార్థసారథి షోమ్, ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్లు రాకేశ్ మోహన్, సుబీర్ గోకర్ణ్, ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి విజయ్ కేల్కర్, సీసీఐ మాజీ ఛైర్మన్ అశోక్ చావ్లా, ప్రసిద్ధ ఆర్థిక వేత్త ఆర్. వైద్యనాథన్, సెబీ ఛైర్మన్ యూకే సిన్హా, మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అశోక్ లహిరి పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి. వీరందరింలోచి ఒకరిని ఎంపిక చేస్తారా.? లేక మరేవరైనా కొత్తవారిని తీసుకువస్తారా అనేది వేచి చూడాలి.






