Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన రేణు దేశాయ్
posted on: Mar 3, 2026 9:34AM

సినీనటి రేణు దేశాయ్ మరోమారు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తన పోస్టులపై గుర్తు తెలియని వ్యక్తులు అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో మూగ జీవులైన కుక్కలను చంపుతున్న ఘటనలపై మీడియా ముందు మాట్లా డిన సందర్భంగా కొందరు వ్యక్తులు ఆమె వ్యాఖ్యలను వక్రీకరించి సోషల్ మీడియా లో అసభ్య కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.
ఆ సమయంలో కూడా ఆమె పోలీసులను ఆశ్రయించి గుర్తు తెలియని వ్యక్తులపై ఫిర్యాదు చేశారు. ఇప్పుడు తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా తనపై అసభ్య పదజాలంతో దూషణలు జరుగుతున్నాయని పేర్కొంటూ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే కొందరు కావాలనే అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కామెంట్లు చేసిన వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని సంబంధిత సోషల్ మీడియా ఖాతాల వివరాలు సేకరిస్తూ దర్యాప్తు ప్రారంభించారు. ఐపీ అడ్ర సులు, డిజిటల్ ఆధారా లను పరిశీలించి నిందితు లను గుర్తించేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.






