యూరప్‌లో అడుగుపెడుతున్న జియో

posted on: May 23, 2018 11:06AM

 

గత ఏడాది మొదలైన జియో సేవలు మన దేశాన్ని ఎంతలా ముంచెత్తాయో చెప్పక్కర్లేదు. ముఖేష్‌ అంబానీ జియో దెబ్బకి, అతని తమ్ముడు అనిల్‌ సామ్రాజ్యం కూడా కుప్పకూలిపోయింది. ఎయిర్‌టెల్ లాంటి దిగ్గజాలు సైతం నష్టాల్లో నడుస్తున్నాయి. ఇప్పుడు ఇదే జియోని యూరప్‌కు పరిచయం చేసే ఆలోచనలో ఉన్నారు అంబానీలు. ముందుగా ఈస్తోనియా అనే చిన్న దేశంలో జియో సేవలను మొదలుపెట్టాలనుకుంటున్నారు. ఈస్తోనియాలో నేరుగా కంపెనీ స్థాపించకుండా, ఆన్‌లైన్‌లోనే అక్కడి వ్యవహారాలను నడిపించే అవకాశం ఉంది. దాంతో ముందు ఈస్తోనియాలో జియో నడిపి చూసి, క్రమంగా యూరప్‌ మొత్తంలోనూ విస్తరించాలనుకునే ఆలోచనలో ముఖేష్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...