ఢిల్లీ పేలుడు మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన
posted on: Nov 11, 2025 8:37PM

ఢిల్లీలో జరిగిన పేలుడులో మరణించిన బాధిత కుటుంబాలకు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. శాశ్వతంగా వికలాంగులైన వారికి రూ. 5లక్షలు తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2లక్షలు అందిస్తామన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్సను అందిస్తామని తెలిపారు. బాధితులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు.
ఈ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా సంతాపం తెలియజేశారు.ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో ఈ పేలుడులో 13 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


.webp)



