ఎవరి కాళ్లు పట్టుకోవల్సిన అగత్యం లేదు :చిరు

posted on: Jan 26, 2012 4:17PM

హైదరాబాద్‌ :రాజకీయ లబ్ధి కోసం ఎవరి కాళ్లా వేళ్లా పడాల్సిన అవసరం లేదని, అగత్యం తనకు లేదని కాంగ్రెస్ నేత చిరంజీవి స్పష్టం చేశారు.రిపబ్లిక్‌డేను పురస్కరించుకుని ఆయన చిరంజీవి రక్తనిధి కేంద్రం కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత కీర్తిని నలుదిశలా చాటేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం ద్వారానే అభివృద్ధి సాధ్యమనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని చిరంజీవి వ్యాఖ్యానించారు.కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం విలీనంపై వస్తున్న విమర్శలను కొట్టిపారేశారు. చేతకాని నేతలే తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. అధికారం కోసం వెంపర్లాడబోనని స్పష్టం చేశారు. 
 

google-ad-img
    Related Sigment News
    • Loading...