Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...63వ గణతంత్ర దినోత్సవ వేడుకలు..భద్రత కట్టుదిట్టం
posted on: Jan 26, 2012 8:42AM
హైద
రాబాద్: 63వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ గురువారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. పరేడ్ గ్రౌండ్లోని గణతంత్ర వేడుకలకు ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, స్పీకర్ నాదెండ్ల మనోహర్, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, డీజీపీ దినేష్ రెడ్డి, పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు, ప్రముఖులు హాజరయ్యారు. అంతకు ముందు ముఖ్యమంత్రి అమర వీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు.
కాగా, గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలో 25 వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. పోలీసులు, పారా మిలటరీ సిబ్బంది, ఎన్‌ఎస్‌జీ షార్ప్‌షూటర్లు భూతలం నుంచి గగనతలం వరకు డేగ కళ్లతో పహారా కాస్తున్నారు. ఉదయం 11.15 గంటల నుంచి 12.15 గంటల వరకు ఢిల్లీ గగనతలాన్ని మూసేయనున్నారు. పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే రాజ్‌పథ్, ఎర్రకోట మార్గంలో సీసీటీవీలు అమర్చారు. రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ జెండా ఆవిష్కరించే రాజ్‌పథ్ వద్ద బహుళ అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాజ్‌పథ్ చుట్టూ, పరేడ్ జరిగే మార్గంలో భారత వాయుసేన హెలికాప్టర్లు గస్తీ కాయనున్నాయి. మరోవైపు నగరంలోని రద్దీ మార్కెట్లు, మెట్రో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. గణతంత్ర వేడుకలకు థాయిలాండ్ ప్రధాని ఇంగ్లుక్ షినవత్రా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.


.jpeg)
.jpeg)


