Latest News

స్థానికుల చొరవ.. ఎర్రచందనం పట్టివేత!

posted on: Jan 21, 2026 9:47AM

స్థానికుల చొరవతో భారీగా ఎర్రచందనం పట్టుబడిన సంఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం అర్లపడియ అటవీ ప్రాంతంలో జరిగింది. చెన్నం బావి చేను మూల వద్ద అక్రమంగా ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేస్తున్న వాహనాన్ని స్థానికులు వెంబడించి నిలిపివేశారు. అయితే ఆ వాహనంలో ఉన్న ముగ్గురు వ్యక్తలూ పరారయ్యారు. అనంతరం వాహనాన్ని తనిఖీ చేయగా, వరిపొట్టు బస్తాల కింద చాకచక్యంగా దాచిన ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. దీంతో స్థానికులు వెంటనే  పోలీసులకు సమాచారం అందించారు.  

​సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని, అందులోని 30 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ సుమారు 20 లక్షల రూపాయలు ఉంటుందని, వాహనం విలువ మరో 5 లక్షల రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లా ఎస్పీ అజిత వేజేండ్ల ఆదేశాల మేరకు, డీఎస్పీ పర్యవేక్షణలో ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది. పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...