ఎర్రచందనానికి ప్రభుత్వం టెండర్

posted on: Jun 21, 2014 11:38AM

 

తీవ్ర ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలపై కొత్తగా ఎటువంటి భారం వేయకుండా ఈ ఆర్ధిక సమస్యల నుండి బయటపడేందుకు ప్రత్యామ్నాయ ఆదాయవనరుల కోసం ఆన్వేషిస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగా అటవీ శాఖ అధికారులు స్మగ్లర్ల నుండి పట్టుకొన్న ఎర్రచందనం దుంగలను అంతర్జాతీయ మార్కెట్ లో అమ్మాలని యోచిస్తోంది. ప్రస్తుతం అటవీశాఖ మరియు దైరేక్తోరేట్ ఆఫ్ రెవెన్యూ డివిజన్ వారి వద్ద దాదాపు 8,000 టన్నుల ఎర్రచందనం దుంగలు చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల గోదాముల్లో పడి ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో వాటి విలువ దాదాపు రూ. 1,200 కోట్లు వరకు ఉంటుందని ఒక అంచనా. ఇంతకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వాటి అమ్మకం కొరకు అనుమతి కోరుతూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కి ఒకలేఖ వ్రాయగా అక్టోబర్ 2013 లోగా అమ్ముకొనేందుకు అందుకు అనుమతి దొరికింది. కానీ ఆ తరువాత ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో రాష్ట్రప్రభుత్వం ఎర్రచందనం అమ్మకం చేయలేకపోయింది. అదిప్పుడు తెదేపా ప్రభుత్వానికి కలిసి వచ్చినట్లయింది.

 

ఇదివరకు ఉన్న 8,000 టన్నులకు తోడు, గత మూడు నాలుగు నెలలో స్మగ్లర్ల నుండి స్వాధీనం చేసుకొన్నది మరో రెండు మూడు వేల టన్నుల వరకు ఉండవచ్చును. ఇప్పుడు ఈ మొత్తం ఎర్రచందనం దుంగలను అమ్ముకొనేందుకు అనుమతి కోరుతూ మళ్ళీ రాష్ట్రప్రభుత్వం డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కి ఒక లేఖ వ్రాయబోతునట్లు సమాచారం. కేంద్రం కూడా రాష్ట్రం పట్ల ఉదారంగా వ్యవహరిస్తోంది గనుక అనుమతి రావడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చును.

 

కేంద్రం నుండి అనుమతి రాగానే ఎర్రచందనం దుంగల అమ్మకానికి త్వరలోనే రాష్ట్రప్రభుత్వం గ్లోబల్ టెండర్లు పిలిచేందుకు సిద్దపడుతోంది. అయితే వాటి అమ్మకం ద్వారా వచ్చే 12 లేదా 1500 కోట్లతో ప్రభుత్వ సమస్యలు తీరేవి కావు. అదొక తాత్కాలిక ఉపశమనమేనని భావించవచ్చును.

google-ad-img
    Related Sigment News
    • Loading...