కూలిన ప్రైవేట్ విమానం...పైలట్‌కు తీవ్ర గాయాలు

posted on: Feb 8, 2026 4:50PM

 

కర్ణాటకలోని బాబలేశ్వర్ వద్ద ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.  రెడ్‌బర్డ్ ఫ్లెయింగ్ అకాడమీకి చెందిన శిక్షణ విమానం కలబురగి నుంచి బెలగావి వెళ్తుండగా ఇంజిన్ విఫలం కావడంలో బబలేశ్వర్ తాలూకా మంగళూరు గ్రామంలోని పంటపొలాల్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్, ట్రైనీ పైలట్‌నీకి తీవ్రగాయాలయ్యాయి. ఫ్లెట్ గాల్లో ఉండగానే ఉంజన్‌లో లోపం తలెత్తడంతో దాన్ని సరిచేందుకు కెప్టన్, ట్రైనీ పైలట్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 

పొలాల్లో అత్యవసర ల్యాండింగ్‌ జరిగే సమయంలో విమానం బలంగా నేలకు తాకడం, వారిరువురూ బయటకు విసిరివేయబడటంతో గాయపడ్డారు. పెద్ద ఎత్తున దుమ్ము, శకలాలలు ఎగసిపడటంతో స్థానికులు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గతేడాది డిసెంబర్‌లో కూడా ఇదే విమానం కూలడం గమనార్హం.. వరుస ప్రమాదాలు విమానయాన భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...