మొంథా తుపాన్ పై రియల్ టైం అప్ డేట్స్.. సీబీఎన్

మొంథా తుఫాన్‌ ప్రభాభం, తీవ్రతపై ఎప్పటికప్పుడు ప్రజలకు చేరేలా రియల్ టైమ్‌లో  అప్ డేట్స్ అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.  తుపాన్  ప్రభావంపై మంగళవారం (అక్టోబర్ 28) ఉదయం నుంచి గంటగంటకూ.. తుఫాన్ బులిటెన్లు విడుదల చేస్తూ ప్రజలను  అప్రమత్తం చేయాలని సూచించారు. స

చివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో మొంథా తుఫాన్ కారణంగా నెలకొన్న పరిస్థితులు, చేపట్టాల్సిన సహాయక చర్యలపై చంద్రబాబు సోమవారం (అక్గోబర్ 27) అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. ఎక్కడా సమాచార  వ్యవస్థకు అంతరాయం కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు.కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు శాటిలైట్ ఫోన్లు వినియోగించాలచెప్పారు. తుఫాన్ ప్రభావం  అధికంగా  ఉండే 2,707 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. 110 మండలాల్లోని సచివాలయాల్లో 3,211 జెనరేటర్లను పవర్ బ్యాకప్ కోసం వినియోగించాలని  నిర్దేశించారు. ఎక్కడా కమ్యూనికేషన్ వ్యవస్థకు అవాంతరాలు తలెత్తకూడదన్నారు. తుఫాన్ వల్ల ఎవరూ ప్రమాదాలబారిన పడకూడదని, ఒక్క మరణం సంభవించకూడదనేది ప్రభుత్వ లక్ష్యం కావాలన్నారు. సముద్ర తీరంలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. వారికి పాతిక కేజీల బియ్యంతో సహా నిత్యావసరాలు అందించాలన్నారు. 

ప్రస్తుతం కాకినాడకు 680 కి.మీ. దూరంలో ఉన్న మొంథా తుఫాన్...16 కి.మీ వేగంతో తీరానికి చేరువ అవుతోందని... దీని ప్రభావంతో ఇప్పటికే ఉత్తర, దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తున్నాయని... మంగళవారం కృష్ణా జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. విద్యాసంస్థలకు ఇప్పటికే సెలవులు ప్రకటించినట్లు తెలిపారు.  తుపాను కారణంగా రహదారులు కోతకు గురైనా, విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడినా వెంటనే పునరుద్ధరించేలా మెటీరియల్, మిషనరీ సిద్ధం చేయాలని, కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. తుఫాను అనంతరం అంటువ్యాధులు సోకకుండా పారిశుధ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు.    

 తుఫాన్ తీరం దాటే సమయంలో ఆస్తి, ప్రాణ నష్టం జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ప్రజలు ఎవరూ బయటకు రాకుండా అలర్ట్ చేయాలి. ఎప్పటికప్పుడు సందేశాలు పంపించి అవగాహన పెంచాలి. తిత్లీ, హరికేన్, హుద్‌హుద్ తుఫాన్ల  అనుభవాన్ని ఇందుకు వినియోగించాలని చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu