విమెన్స్ ప్రీమియర్ లీగ్ విజేత ఆర్సీబీ

posted on: Feb 6, 2026 8:14AM

ఆర్సీబీ విమెన్స్ ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచింది. గుజరాత్ లోని వడోదర వేదికగా గురువారం (ఫిబ్రవరి 5)న జరిగిన ఫైనల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ టోర్నీ విజేతగా నిలిచింది. డబ్ల్యుపిఎల్ ప్రీమియర్ లీగ్ ను గెలుచుకోవడం ఆర్సీబీకి ఇది రెండో సారి. ఇక మ్యాచ్ వివరాల్లోకి వస్తే.. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్ నిర్ణీత 20 ఓవర్లలో   4 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు సాధించింది.  

ఢిల్లీ జట్టులో కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ 37 బంతుల్లో 8 ఫోర్లతో 57 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. లారా వోల్వార్డ్ట్ పాతిక  బంతుల్లో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు  ఓపెనర్లు లిజెల్ లీ 37 పరుగులు, షఫాలీ వర్మ 20 పరుగులు సాధించారు.   చివర్లో చినెల్ హెన్రీ కేవలం 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేసి స్కోరు బోర్డును 200 పరుగులు దాటించడంలో కీలక పాత్ర పోషించింది.  

204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ అలవోకగా ఛేదించేసింది.  కెప్టెన్ స్మృతి మంధాన  87 పరుగులు, జార్జియా వోల్ 79 పరుగులు చేశారు డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే ఫైనల్ లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డు సృష్టించింది.

భారీ లక్ష్య ఛేదనతో బ్యాటింగ్ చేపట్టిన ఆర్సీబీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.  ఓపెనర్ గ్రేస్ హారిస్ కేవలం 9 పరుగులు చేసి ఔటైంది. అయితే స్మృతి మంధాన, జార్జియా వోల్ అద్భుత భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. ముఖ్యంగా స్మృతి మంధాన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడింది. వోల్, స్మృతి మంధానా  రెండో వికెట్ కు రెండో వికెట్‌కు 165 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.

అయితే విజయం ముంగిట ఆర్సీబీ త్వరత్వరగా రెండు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఉత్కంఠ భరితంగా మారింది. కానీ డి క్లర్క్, రాధా యాదవ్ లు చివరి వరకూ నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీ లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...