Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆర్సీబీ జోరు.. ఢిల్లీ బేజారు
posted on: Apr 28, 2026 8:23AM

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. సోమవారం (ఏప్రిల్ 27) ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన పోరులో బెంగళూరు బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను కట్టడి చేశారు. కేవలం 75 పరుగులకే ఢిల్లీని ఆలౌట్ చేసిన ఆర్సీబీ, అనంతరం స్వల్ప లక్ష్యాన్ని కేవలం 6.3 ఓవర్లలోనే ఛేదించి 9 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరుకు పేసర్లు హేజిల్ వుడ్, భువనేశ్వర్ కుమార్ లు అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. ఆది నుంచే ఢిల్లీ బ్యాటర్లపై నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డారు. హేజిల్‌వుడ్ 4 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు పడగొట్టారు. వీరిద్దరి స్వింగ్ ధాటికి ఢిల్లీ పవర్‌ప్లే ముగియకముందే పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒక దశలో 8 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు దిశగా పయనించింది.
అయితే కష్టాల్లో ఉన్న జట్టును అభిషేక్ పోరెల్ 30 పరుగులు చేసి ఒకింత ఆదుకున్నాడు. డేవిడ్ మిల్లర్ 19 పరుగులు చేయడంతో ఢిల్లీ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మిగిలిన బ్యాటర్లు ఎవరూ కనీసంరెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. దీంతో ఢిల్లీ ఇన్నింగ్స్ 16.3 ఓవర్లలో 75 పరుగుల వద్ద ముగిసింది.
అనంతరం 76 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ బ్యాటర్లు ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించారు. ఓపెనర్ జాకబ్ బెథెల్ 20 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ కలిసి మ్యాచ్‌ను ముగించేశారు. పడిక్కల్ కేవలం 13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 పరుగులు చేసి అజేయంగా నిలవగా, కోహ్లీ 23 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇద్దరూ పోటీపడి బౌండరీలు బాదడంతో కేవలం 39 బంతుల్లోనే మ్యాచ్ ముగిసింది.
ఈ భారీ విజయంతో ఆర్సీబీ రన్ రేట్ అమాంతం పెరిగింది. ఇది తరువాత దశలో ఆర్సీబీకి ఎంతో కీలకం అవుతుందనడంలో సందేహం లేదు. మరోవైపు వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్, తన సొంత గడ్డపైనే ఇంత ఘోర పరాజయాన్ని చవిచూడటం ఆ జట్టు అభిమానులను నిరాశకు గురిచేసింది. రాబోయే మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ విభాగం పుంజుకోకుంటే ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది. ఆర్సీబీ మాత్రం ఇదే ఊపును కొనసాగించి టైటిల్ వేటలో ముందడుగు వేయాలని భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్ లో మరో విశేషం ఏమిటంటే కింగ్ కోహ్లీ ఐపీఎల్ లో9 వేల పరుగుల మార్క్ చేరుకున్నాడు. ఐపీఎల్ లో 9 వేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్ మన్ గా రికార్డు సృష్టించాడు.



.webp)


