Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాజన్ అయిపోయాడు..నెక్ట్స్ నీ పనే..
posted on: Jun 20, 2016 3:01PM

ఆర్‌బీఐ గవర్నర్‌గా రఘురామ్ రాజన్‌ను రెండోసారి కొనసాగించవద్దంటూ బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అమెరికా గ్రీన్ కార్డు పోందిన రాజన్..మానసికంగా పూర్తి భారతీయుడు కాదని, భారత ఆర్ధిక వ్యవస్థ వృద్ధి పథంలో పయనించకుండా ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుకున్నారని తక్షణం ఆయన్ను బాధ్యతల నుంచి తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఒక లేఖ రాశారు. యూపీఏ ప్రభుత్వం నియమించిన వ్యక్తిని ఇప్పుడు కీలక బాధ్యతల్లో కొనసాగించడం మంచిదికాదని అన్నారు. ఆయన రాజేసిన అగ్గికారణంగా ఎప్పుడో సెప్టెంబర్‌లో జరగాల్సిన చర్చ కాస్త మేలోనే జరిగింది. ఎందుకంటే రాజన్ పదవీకాలం సెప్టెంబర్‌లో ముగుస్తుంది.
దేశవ్యాప్తంగా రాజన్‌ను కొనసాగించాలనే వారు..తీసివేయాలనే వారు పరస్పరం మాటల యుద్ధం చేసుకోవడంతో రఘురాం తీవ్ర మనస్థాపం చెందారు. తాను రెండవసారి ఆర్బీఐ గవర్నర్‌గా కొనసాగలేనంటూ ప్రకటించి అందిరిని ఆశ్చర్యంలో ముంచారు. తన ప్రయత్నాలు ఫలించి రాజన్ వైదొలుగుతుండటంతో సుబ్రమణ్యస్వామి ఖుషి ఖుషిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన నెక్ట్స్ టార్గెట్‌గా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎంచుకున్నారు.
ఎంఎం ఖాన్ మర్డర్ కేసులో బీజేపీ ఎంపీ మహేశ్ గిరీ దోషి అంటూ కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. ఆ వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన మహేశ్ ఇవాళ కేజ్రీవాల్ ఇంటిముందు ఆందోళనకు దిగారు. ఆయన ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు అక్కడికి వెళ్లిన సుబ్రమణ్యస్వామి కార్యకర్తలనుద్ధేశించి మాట్లాడారు. తాను ఇప్పటి వరకు ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ వెంటపడ్డానని, ఆయన వెళ్లిపోయాడని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంగతి తెలుస్తానని అన్నారు. కేజ్రీ జీవితం అంతా ఫ్రాడే, ఐఐటీలో తాను మెరిట్ స్టూడెంట్ అంటూ కేజ్రీ గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఆయన ఐఐటీలో ఎలా అడ్మిషన్ పొందాడో త్వరలో వెల్లడిస్తానని సుబ్రమణ్యస్వామి హెచ్చరించారు. మరి కేజ్రీవాల్, స్వామిని ఏ మేరకు ఎదుర్కొంటారో చూడాలి.






