Latest News

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పటిష్టతపై ఆర్‌బీఐ భరోసా.. చైర్మన్ నిష్క్రమణపై క్లారిటీ!

posted on: Mar 20, 2026 10:37AM

  ప్రైవేట్ రంగంలోని బ్యాంకులలో అతి పెద్ద బ్యాంక్ అయిన హెచ్ డీఎఫ్ సీ చైర్మన్ ఆకస్మిక రాజీనామా బ్యాంకింగ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.  ఈ రాజీనామాతో హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ ఆర్థిక స్థితిగతులపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ బ్యాంకు  పార్ట్ టైమ్ చైర్మన్ పదవి నుంచి   చక్రబర్తి అనూహ్యంగా, ఆకస్మికంగా  తప్పుకోవడంతో  హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు ఖాతాదారులు, ఇన్వెస్టర్లలో కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం అయ్యింది. ఈ నేపథ్యంలో  ఆర్బీఐ బ్యాంక్ పటిష్ఠతకు, ఖాతాదారులు, ఇన్వెస్టర్ల సొమ్ములకూ ఎటువంటి ముప్పూ లేదని క్లారిటీ ఇచ్చింది.  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆర్థిక స్థితిగతులు  పటిష్టంగా ఉన్నాయని, ఎటువంటి ఆందోళన అవసరం లేదనీ ప్రకటించింది.  

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డొమెస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్ (డీ-ఎస్ఐబి) హోదాను కలిగి ఉన్న బ్యాంక్ అని పేర్కొన్న ఆర్బీఐ.. బ్యాంక్ వద్ద తగినంత మూలధన నిల్వలు ఉన్నాయని, నిర్వహణ తీరులో గానీ, పాలనపరమైన వ్యవహారాల్లో కానీ అంతా సవ్యంగా ఉందనీ స్పష్టం చేసింది.  ఒక ఉన్నత స్థాయి అధికారి వైదొలిగినంత మాత్రాన బ్యాంక్ కార్యకలాపాలకు వచ్చే ముప్పేమీ లేదని ఆర్బీఐ పేర్కొంది.

  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పునాదులు చాలా బలంగా ఉన్నాయని, ఇది ఒక శక్తిమంతమైన సంస్థగా కొనసాగుతుందని  కేంద్ర ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి ఎం. నాగరాజు పేర్కొన్నారు. ఆర్‌బీఐ ప్రకటన ద్వారా బ్యాంక్ ట్రాన్సరసీ, క్రెడిబులిటీ మరోసారి నిరూపితమయ్యాయన్నారు.  బ్యాంక్ కార్యకలాపాలు ఎప్పటిలాగే సజావుగా సాగుతున్నాయి. కొత్త చైర్మన్ ఎంపిక ప్రక్రియ పూర్తిస్థాయిలో ముగిసే వరకు కేకీ మిస్త్రీ సారథ్యంలో బోర్డు కొనసాగనుంది. మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, ఆర్‌బీఐ ఇచ్చిన క్లారిటీతో ఖాతాదారుల పెట్టుబడులకు పూర్తి రక్షణ ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...