టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన రవిచంద్ర

posted on: Feb 6, 2026 10:59AM

తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఈవో గా  రవిచంద్ర బాధ్యతలు చేపట్టారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఇన్ చార్జి ఈవో వెంకయ్య చౌదరి నుండి రంగనాయకమంటపంలో  టీటీడీ ఈవోగా రవిచంద్ర బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక భక్తుడిగా తోటి భక్తులకు సేవ చేసే భాగ్యం కలిగిందన్నారు.

భక్తుల నమ్మకాన్నీ, ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా విధులు నిర్వహిస్తానని చెప్పారు. టీటీడీ ఈవోగా తనకు అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికీ ఈ సందర్భంగా కృతజ్ణతలు తెలిపారు.  అందరి సలహాలూ, సూచనలూ తీసుకుని భక్తులకు మెరుగైన సేవలు అందిస్తాన్నారు. ముఖ్యమంత్రి పేషీలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేస్తున్న రవిచంద్రకు ప్రభుత్వం టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించిన సంగతి విదితమే.  

google-ad-img
    Related Sigment News
    • Loading...