కేసీఆర్ సిట్ విచారణపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

posted on: Feb 2, 2026 6:45PM

 

 

రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ అవార్డు వేడుకలను నేడు హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో అట్టహాసంగా నిర్వహించారు.  2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ‘రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ అవార్డును జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ప్రధానం చేశారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతు రావి నారాయణ రెడ్డి స్ఫూర్తితో తాము పనిచేస్తున్నామని తెలిపారు.. నాడు ప్రజల కష్టాలు, రాచరిక పోకడలు, అరాచక చర్యలపై నారాయణ రెడ్డి పోరాడారని కొనియాడారు. 

స్వేచ్చను హరించి, హక్కులకు భంగం కలిగిస్తే తిరుగుబాటు వస్తుందన్నారు. తెలంగాణ జాతిపిత అని కొందరు వాళ్లకు వాళ్లే రాసుకుంటున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. ఉద్యమకారులం అని వాళ్లే చెప్పుకుంటున్నారుని.. పోలీసులు చిన్న నోటీసులు ఇస్తే జాతిపితకు నోటీసులు ఇస్తారా అంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాడు జాతిపిత మహాత్మ గాంధీజీ పదవులను త్యాగం చేసి దుర్మార్గుల తూటాలకు ప్రాణాలు వదిలారని ముఖ్యమంత్రి తెలిపారు. మరి ఇప్పుడు జాతిపిత అని చెప్పుకుంటున్న వాళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. 

తెలంగాణ ఉద్యమకారులను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించిన ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమకారుడు కాదా..ఆనాడు తలుపులు బద్దలు కొట్టి ఆయన్ను అరెస్టు చేసింది మీ పాలనలో కాదా.. అప్పుడు ఉద్యమకారులు గుర్తుకురాలేదా అని కేసీఆర్‌ను సీఎం ప్రశ్నించారు. పోలీసులు మిమ్మల్ని అలా తలుపులు బద్దలు కొట్టి తీసుకురాలేదు కదా… నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారని రేవంత్ అన్నారు. రావి నారాయణ రెడ్డి లాంటి వారు తెలంగాణ కోసం సర్వం కోల్పోయారని తెలిపారు. 

పదవులు, వేలకోట్ల ఆస్తులు సంపాదించుకున్న మీరు ఉద్యమకారులు ఎలా అవుతారని ప్రశ్నించారు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినప్పుడు అర్థం చేసుకోవాలీ.. హుందాగా తప్పుకుంటే కొంతైనా మీ గౌరవం నిలబడేదన్నారు. అక్రమ మార్గం ఎంచుకున్న వారు ప్రజాస్వామ్యంలో విచారణ ఎదుర్కోవాల్సిందే అని అంబేద్కర్ చెప్పారు.. శిబు సోరెన్ లాంటి వాళ్లు విచారణ ఎదుర్కొన్నారు. మనమేం దైవాంశ సంభూతులం కాదని ముఖ్యమంత్రి తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...