హత్యాచార నిందితుడి ఆత్మహత్య

posted on: Feb 18, 2026 9:31AM

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిందితుడు కులవర్దన్ మృతదేహం  కురబలకోట మండలంలోని కనసానివారి పల్లి చెరువులో  బుధవారం (ఫిబ్రవరి 18)  లభ్యం అయింది.  

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకున్నారు.  మదనపల్లె చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన కులవర్థన్ కోసం పోలీసులు మంగళవారం (ఫిబ్రవరి 17) నుంచి విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో  కులవర్దన్  చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్నారు. ఇలా ఉండగా హత్యాచారానికి గురైన బాలిక అంత్యక్రియలు  అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం దిండిమీదాగారి పల్లె గ్రామంలో  బుధవారం (ఫిబ్రవరి 18) జరిగాయి.  చిన్నారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  

google-ad-img
    Related Sigment News
    • Loading...