హైదరాబాద్‌లో అడ్వకేట్ దారుణ హత్య

posted on: Feb 14, 2026 3:39PM

 

రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్ర నగర్ లో ఉన్న అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన సంచలనం సృష్టించింది. సులేమాన్ నగర్ ప్రాంతంలో ప్రముఖ అడ్వకేట్ మహమ్మద్ ఖదీర్‌ను గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఖదీర్ తన కార్యాలయంలోఒంటరి గా ఉన్న సమయంలో అక్కడికి వచ్చిన దుండ గులు ఒక్కసారిగా అడ్వకేట్ పై దాడి చేసి పలుమార్లు కత్తితో పొడిచి హత్య చేశారు.

ఖదీర్ కి తీవ్ర గాయాలు కావడంతో అధిక రక్తస్రావం జరిగి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరార య్యారు. సమాచారం అందు కున్న వెంటనే అత్తాపూర్ పోలీసులు, క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. రక్తపు మచ్చలు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమి కంగా కుటుంబ విభేదాల కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. 

ముఖ్యంగా బావమరిది వైపు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. హత్యకు గల అసలు కారణాలపై పోలీసులు విచారణ కొనసాగించారు..ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే న్యాయవాది మహమ్మద్ ఖదీర్ మొదటి భార్యను విడిచిపెట్టి...రెండో పెళ్లి చేసుకున్నాడు. తన అక్క కుటుంబం నాశనం అయిందని బామ్మర్దులు పగ పెంచుకొని హత్య చేసినట్లుగా ప్రాథమిక విచారణలో బయటపడింది... పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతూ దర్యాప్తు ముమ్మరం చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...