Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పెళ్లి వేడుకలో విషాదం...స్విమ్మింగ్ పూల్‌లో పడి బాలుడు మృతి
posted on: Feb 9, 2026 7:51PM

రంగారెడ్డి జిల్లాలోని మోయినాబాద్ మండలంలో ఉన్న చిలుకూరు పరిధిలోని ఓ రిసార్టులో జరిగిన వివాహ వేడుక ఒక్కసారిగా విషాదంగా మారింది. ఒకవైపు అంగరంగ వైభవం గా పెళ్లి కార్యక్రమం కొన సాగుతుండగా, అందరూ ఆనందోత్సాహాలతో మాట్లాడుకుంటున్నారు. మరోవైపు చిన్నారులు సరదాగా ఆటల్లో మునిగి పోయారు. ఆ క్షణాల్లోనే ఎవరూ ఊహించని విధంగా ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. రిసార్టులో ఉన్న స్విమ్మింగ్ పూల్ వద్ద ఆడుకుంటున్న 15 సంవత్సరాల బాలుడు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు.
నీటిలో మునిగిన బాలుడిని అక్కడున్నవారు గమనించ కపోవడంతో కొద్ది సేపటికి పరిస్థితి విషమించింది. బాలుడు కనిపించకపోవడంతో రిసార్ట్ మొత్తం తిరిగారు... అయితే పెళ్లి వేడుకలో పాల్గొన్న బంధువులందరూ చుట్టుపక్కల వెతుకుతూ స్విమ్మింగ్ పూల్‌ను పరిశీలించగా, నీటిలో అపస్మారక స్థితిలో ఉన్న బాలుడు కనిపించాడు. దీంతో బాలుడిని హుటా హుటిన బయటకు తీసి పరీక్షించగా, అప్పటికే అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఈ ఘటనతో ఆనందోత్సాహాలతో సాగుతున్న వివాహ వేడుక ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి వెళ్లింది. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. పెళ్లి సందడి స్థానంలో కన్నీళ్లే మిగిలాయి. సమాచారం అందుకున్న వెంటనే మొయినాబాద్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. స్విమ్మింగ్ పూల్ వద్ద భద్రతా ఏర్పాట్లు, పర్యవేక్షణలో నిర్లక్ష్యం ఉందా అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన ఫంక్షన్స్ సమయంలో పిల్లల భద్రతపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పోలీసులు సూచించారు.






