బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు : మంత్రి పొన్నం
posted on Nov 3, 2025 11:11AM

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అధికారికంగా ఇప్పటి వరకూ 19 మంది చనిపోయారని మంత్రి తెలిపారు. మృతుల కుటుంబాలను కుటుంబాలకు రూ.5 లక్షలు, ఆర్టీసీ తరుపున మరో రూ. 2 లక్షల క్షతగాత్రులకు రూ. 2 లక్షల పరిహారం ఇస్తామని పేర్కొన్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతోంది. మృతుల్లో పది మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు. 19 మందిలో 13 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం’’ అని మంత్రి తెలిపారు. ఈ బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అదేవిధంగా గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారం అందిస్తామని వెల్లడించారు.