రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి
posted on Nov 3, 2025 10:50AM
.webp)
రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కుమార్తెలు తనూష, సాయి ప్రియ, నందిని హైదరాబాద్‌లో చదువుతున్నారు. ఇటీవల పెళ్లి ఉండటంతో సొంతూరుకు వచ్చారు. ఈ తెల్లవారుజామున తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా బస్సు ప్రమాదం జరిగి చనిపోయారు.
మరోవైపు యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్‌కు చెందిన అఖిలరెడ్డి అనే యువతి కూడా ఇదే ప్రమాదంలో చనిపోయారు. ఎంబీఏ చదువుతున్న కుమార్తె మృతితో అఖిల తల్లి, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనాస్థలానికి వచ్చి బోరున విలపించారు. ఇటీవల జరిగిన ఓ పెళ్లివేడుకలో సందడిగా గడిపిన ఈ ముగ్గురూ ఇవాళ విగత జీవులుగా మారడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.