లేడీ కానిస్టేబుల్‌ను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన విద్యార్థినులు

 

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉద్రిక్తత నెలకొంది. ప్రిన్సిపాల్ శైలజ తమను వేధిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థినులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఆమెను తక్షణం సస్పెండ్ చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. 

విద్యార్థినులు ఆరోపించిన ప్రకారం  ప్రిన్సిపాల్ ఫండ్స్ విడుదల చేయడం లేదని, ఇంటర్నల్ పరీక్షలు రాయనివ్వలేదని, ఒక్కొక్కరి నుంచి రూ.3,000 చొప్పున ఫీజులు వసూలు చేశారని తెలిపారు. అంతేకాకుండా కుల పేరుతో దూషించిందని కూడా ఆరోపించారు.ఆందోళనను నియంత్రించేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. 

ఈ క్రమంలో ఒక మహిళా కానిస్టేబుల్ విద్యార్థినులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా, కొంతమంది విద్యార్థినులు ఆమెపై దాడి చేసి జుట్టు పట్టుకుని ఈడ్చారు. ఈ ఘటనతో అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక విద్యా శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థినులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu