రంజాన్ సెలవు మార్చి 20న కాదు 21న

posted on: Mar 20, 2026 9:51AM

ఆంధ్రప్రదేశ్‌లో రంజాన్ సెలవు ను శుక్రవారం కాకుండా శనివారానికి మారుస్తూ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గురువారం (మార్చి 19) అర్ధరాత్రి దాటిన తరువాత అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సర్కార్ ముందుగా ఈ నెల 20 (శుక్రవారం) రంజాన్  సెలవు ప్రకటించింది.   అయితే రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు సీఈవో నుంచి.. నెల వంక దర్శనం ఆధారంగా రంజాన్‌ పండగ శనివారం (మార్చి 21) వస్తుందని ప్రభుత్వానికి లేఖ అందింది. ఈ క్రమంలో  రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ సెలవు దినాన్ని శుక్రవారం (మార్చి 20)న కాకుండా శనివారం (మార్చి 21) ని సాధారణ సెలవుగా ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ సాయిప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా రంజాన్ సెలవు తేదీ మారడంతో అందుకు అనుగుణంగా రాష్ట్రంలో జరుగుతున్న టెన్త్ పరీక్షల టైం టేబుల్ లో కూడా స్వల్ప మార్పు చేశారు. శనివారం (మార్చి 21) జరగాల్సిన టెన్త్ ఇంగ్లీష్ పరీక్షను ఏప్రిల్ 2కు వాయిదా వేశారు.  ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం టెన్త్ ఇంగ్లీష్ పరీక్ష శుక్రవారం (మార్చి 20) జరగాల్సి ఉంది. అయితే ఆ రోజు రంజాన్‌ సెలవుగా నిర్ణయించడంతో  ఇంగ్లీష్ పరీక్షను శనివారం (మార్చి 21) న నిర్వహించాలని నిర్ణయించారు. అయితే తాజాగా రంజాన్‌ సెలవు శనివారానికి (మార్చి 21) మారడంతో ఇంగ్లీష్ పరీక్షను అన్ని పరీక్షలు ముగిసిన తర్వాత ఏప్రిల్‌ 2వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...