Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పాపం పసివాడు:విగ్రహంగా మారుతున్న బాలుడు
posted on: Jun 11, 2016 3:26PM

సువర్ణసుందరి సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు శాపం కారణంగా రాయిలా మారుతుంటాడు..దేవలోకంలో ఉన్న ఒక పుష్పం తెచ్చి ఆయన తలపై పెడితేనే శాపం తీరుతుంది. నేపాల్‌లో ఓ బాలుడి పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది..తోటిపిల్లలతో సరదాగా ఆడుతూ, పాడుతూ ఉండాల్సిన వయస్సులో రమేశ్ కుమార్ అనే చిన్నారి అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతున్నాడు.

పదకొండేళ్ల బాలుడి శరీరంపై చర్మం ఉన్నట్టుండి ఊడిపోయి దాని స్థానంలో గట్టిగా, మందంగా చర్మం రావడంతో ఆ చిన్నారి తల్లడిల్లిపోతున్నాడు. ఇచ్‌థైసోసిస్ అనే వ్యాధి కారణంగా శరీరం వికృతంగా మారిపోవడంతో తోటి పిల్లలు కూడా అతనితో కలిసి ఆడుకోవడానికి కూడా భయపడుతున్నారు. పుట్టిన 15వ రోజు నుంచే రమేశ్‌కు చర్మం ఊడిపోవడం, గట్టిపడటం ప్రారంభమైంది. వయసు పెరిగే సరికి పరిస్థితి మరింత దారుణంగా తయారై కనీసం నిలబడటం, నడవడం కూడా కష్టంగా మారింది.

పిల్లాడి పరిస్థితి చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. వైద్యులకు చూపిస్తే వారానికి ఒకసారి యాంటీబయోటిక్ ఇంజెక్షన్ ఇవ్వాలని సూచించారని చిన్నారి తల్లి కంటతడితో చెప్పింది. కానీ వారికి ఆ ఇంజెక్షన్ ఇప్పించేంత స్థోమత లేదు. ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో బాలుడి వీడియోను చూసిన బ్రిటన్ గాయకురాలు జోస్‌స్టోప్ ఆ పసివాడికి బాసటగా నిలిచారు. ఆమె తన ఫౌండేషన్ ద్వారా రూ.1.33 లక్షల ఆర్ధిక సాయాన్ని అందించింది. దీంతో బాలుడి పరిస్థితి ఇప్పుడిప్పుడే కాస్త మెరుగుపడుతోంది.



.jpg)
.jpg)


