Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మైక్రో ఫైనాన్స్ కేసులో ట్విస్ట్!
posted on: Apr 16, 2026 7:09PM

హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన మైక్రో ఫైనాన్స్ మోసం కేసు కొత్త మలుపు తిరిగింది. రామావత్ మధును సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ముందుగా న్యాయవాది సుబ్బారావు మైక్రో ఫైనాన్స్ పేరుతో భారీగా డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తూ గాయని మంగ్లీ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అనంతరం మంగ్లీ కూడా ఈ ఆరోపణలను ఖండిస్తూ పంజాగుట్ట పోలీసులు ను ఆశ్రయించడంతో పాటు హైదరాబాద్ సీపీ, డీజీపీ లకు కూడా ఫిర్యాదు చేసింది.ఈ పరిణామాల మధ్య రామావత్ మధు విడుదల చేసిన వీడియో మరింత సంచలనం సృష్టించింది.
మా గురువు హేమ కాంత్ రెడ్డి న్యాయవాది సుబ్బారావు, సరిత కలిసి ఒక గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. సరిత బాధితురాలు కాదు.. కానీ మీడియా ముందుకు వచ్చి ఏడుస్తూ బలే నటిస్తుంది. ముఖ్యంగా సరితను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే నిజాలు వెలుగులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ వీడియో విడుదలైన కొద్దిసేపటికే సైబరాబాద్ పోలీసులు రామావత్ మధును అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఆయనపై పలు కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, దర్యాప్తు పురోగతిపై ఆసక్తి నెలకొంది.






