రంగంలోకి పవన్ కళ్యాణ్...బీజెపీకి మద్దతుగా ప్రచారం

 

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గోన్ననున్నారు.  బిజెపి అభ్యర్థికి లంకల దీపక్‌రెడ్డికి మద్దతుగా ఒక రోజు రోడ్-షో, బహిరంగ సభకు హాజరుకావాల్సిందిగా డిప్యూటీ సీఎంను బిజెపి నాయకులు  ఆహ్వానించారు. బిజెపికి మద్దతుగా తెలంగాణ జనసేన నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తారు. జూబ్లీహిల్స్ లో సామాజిక సమీకరణాలు కీలకంగా మారాయి. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో బీజేపీకి జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌ గౌడ్‌ మద్దతు ప్రకటించారు. 

ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, టీబీజేపీ చీఫ్ ఎన్‌.రామచందర్‌రావు సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పలు పార్టీలు దూసుకుపోతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గల్లీ గల్లీకి తిరుగుతు ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా కేటీఆర్ రోడ్ షాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బిజెపి అభ్యర్థికి లంకల దీపక్‌రెడ్డికి గెలుపు కోరుకు మార్నింగ్ వాక్, పాదయాత్రలు చేస్తున్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu