Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రామరాజ్యం.. పర్ ఫెక్షన్ కాదు.. కరెక్షన్ ప్రాసెస్
posted on: Apr 28, 2026 4:19PM
.webp)
రామరాజ్యం ఎప్పుడు వస్తుంది? ఇటీవలి కాలంలో ఈ ప్రశ్న తరచూ వినిపిస్తోంది. అయితే.. రామరాజ్యం అంటే పరిపూర్ణం.. అంటే పెర్ఫట్ అని అర్ధం కాదు.. అది నిరంతర కరెక్షన్ ప్రాసెస్ అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇండియాలో జరుగుతున్నది అదే. అంటే మనం ఉన్నది రామరాజ్యంలోనే.. ఈ ఇప్పుడు భారత్ లో కేవలం అభివృద్ధి మాత్రమే జగరడం లేదు.. వలసవాద నిర్మూలన (డీ కొలనైజేషన్) ప్రాసెస్ జరుగుతోంది. పాతికేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని గమనించినట్లైతే.. ఇండియా అనూహ్య రీతిలో అభివృద్ధి చెందింది. 2000 - 2025 మధ్య కాలంలో దేశం సాధించిన ఆర్థిక, సామాజిక మార్పులు కేవలం గణాంకాలకే పరిమితం కాదు.. ఒక నూతన జాతీయ చైతన్యాన్ని ప్రతిబింబంకూడా. రామరాజ్యం అంటే ఏదో అద్భుతం జరుగుతుందని ఎదురుచూడటం కాదు.. ప్రస్తుత వ్యవస్థలో జరుగుతున్న సానుకూల మార్పులను గుర్తించి, ఆమోదించడమే.
ఆర్థిక గణాంకాలను పరిశీలిస్తే, 2000 సంవత్సరంలో 460 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత జీడీపీ ఇప్పుడు 4.5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. తలసరి ఆదాయం 450 డాలర్ల నుండి 2700 డాలర్లకు పెరగడమే కాకుండా, పేదరికం 45 శాతం నుండి 12 శాతానికి గణనీయంగా తగ్గింది.
ఆయుర్దాయం62 నుంచి 70 ఏళ్లకు పెరిగింది. ఆహార భద్రతను అధిగమించి దేశం ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఎదిగింది. మధ్య తరగతి జనాభా5 కోట్ల నుంచి 30 కోట్లకు పెరిగింది. ఆసుపత్రులు18 వేల నుంచి 70 వేలకు, అక్షరాస్యత 77శాతానికి పెరిగాయి. ఇక విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, డిజిటల్ లావాదేవీలు, విశ్వవిద్యాలయాలు ఐఐటీలు మెడికల్ కాలేజీలు ఇలా అభివృద్ధి చెందని రంగం అంటే లేదన్నట్లుగా ఇండియా ప్రగతి బాటలో దూసుకువెడుతున్నది.
ఐఐటీలు, మెడికల్ కాలేజీల సంఖ్య పెరగడంతో పాటు, రక్షణ రంగ ఎగుమతులు జీరో నుండి 20 వేల కోట్ల రూపాయలకు చేరడం దేశ స్వయం సమృద్ధికి నిదర్శనం. కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాకుండా, దేశం తన వలసవాద గుర్తులను చెరిపివేస్తూ స్వయం అస్తిత్వాన్ని చాటుకుంటోంది. రాజ్ పథ్ కర్తవ్య పథ్ గా మారడం, కొత్త పార్లమెంటు నిర్మాణం, సెంగోల్ స్థాపన వంటివి కేవలం భౌతిక మార్పులు కావు.. ఇవి భారతీయ ఆత్మగౌరవానికి ప్రతీకలు. దీనికి తోడు అయోధ్యలో రామమందిరం, కాశీ విశ్వనాథ్ కారిడార్ వంటి ఆధ్యాత్మిక ప్రాజెక్టులు దేశ సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించాయి. ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో, భారత్ అత్యంత స్థిరమైన వ్యవస్థగా ఎదుగుతోంది. మెకాలే విద్యావిధానం స్థానంలో మాతృభాషలకు ప్రాధాన్యతనిచ్చే నూతన పద్ధతులు, భారతీయ న్యాయ సంహిత వంటి సంస్కరణలు వ్యవస్థలో వేళ్లూనుకున్న పాత చట్టాలను ప్రక్షాళన చేస్తున్నాయి. ఈ మార్పులన్నీ దేశం సరైన దిశలో పయనిస్తోందనడానికి నిదర్శనాలుగా చెప్పుకోవాలి. అయితే.. ఈ ప్రగతి ఫలాలు పూర్తిస్థాయిలో అందాలంటే కేవలం ప్రభుత్వంపైనే ఆధారపడకుండా పౌరుల బాధ్యత కూడా కీలకం. అవినీతి రహిత సమాజం, అర్హతకు ప్రాధాన్యతనిచ్చే వ్యవస్థ ఏర్పడాలంటే ప్రతి వ్యక్తి తనలోని నైతికతను మేల్కొల్పాల్సిన అవసరం ఉంది. దేశ విభజన శక్తులకు తావు లేకుండా, భారత్ పట్ల గౌరవంతో మెలగడమే రామరాజ్య స్థాపనకు అసలైన మార్గం.
మీకు ఈ విశ్లేషణ నచ్చినట్లైతే ‘తెలుగువన్’ ను ఫాలో అవ్వండి. షేర్ చేయండి
-సీతారాం కంఠంనేని
references
- ప్రపంచ బ్యాంక్ డేటా (World Bank Data): GDP, తలసరి ఆదాయం, పేదరికం
- ఆర్థిక సర్వే 2024-25, భారత ప్రభుత్వం (Economic Survey, Govt of India)
- NITI ఆయోగ్: బహుముఖ పేదరికం నివేదిక (Multidimensional Poverty Index)
- RBI డిజిటల్ లావాదేవీల నివేదిక (Digital Payment Report)
- UGC/AICTE: విశ్వవిద్యాలయాలు, కళాశాలల గణాంకాలు
- భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఎగుమతి నివేదిక, 2024-25
- NHAI: జాతీయ రహదారుల గణాంకాలు
- AAO: విమానాశ్రయాల విస్తరణ నివేదిక
- ప్రభుత్వం ప్రకటించిన పేదరికం నిష్పత్తి (NITI ఆయోగ్, 2024)
- రామమందిరం, కాశీ, మహాకాల్ ప్రాజెక్టుల వివరాలు – భారత ప్రభుత్వం, పర్యాటకం, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నివేదికలు





