‘మంగళవారం’ కోసం వెయిట్‌ చేస్తున్న రామ్‌చరణ్‌

posted on: Nov 23, 2023 9:13AM

ఇటీవల విడుదలైన ‘మంగళవారం’ చిత్రానికి హిట్‌ టాక్‌ రావడంతో పాటు మంచి కలెక్షన్లు కూడా రాబడుతున్న విషయం తెలిసిందే. సినిమాకి వస్తున్న రెస్పాన్స్‌తో థియేటర్ల సంఖ్యను కూడా భారీగానే పెంచారు. ఈ చిత్రానికి వస్తున్న టాక్‌పై మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ‘నా ప్రియమైన స్నేహితురాలు స్వాతి గునుపాటి తన తొలి ప్రయత్నంలోనే హిట్‌ చిత్రాన్ని అందించినందుకు అభినందనలు. సినిమాకి మంచి పాజిటివ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఈ సినిమా టెక్నికల్‌గా బాగుందని, ముఖ్యంగా అజయ్‌ భూపతి డైరెక్షన్‌, సంగీతం, సినిమాటోగ్రఫీ అన్నీ బాగా కుదిరాయని విన్నాను. ఈ సినిమా చూడటానికి వెయిట్‌ చేస్తున్నాను’ అని ట్వీట్‌ చేశారు. అజయ్‌ భూపతి, అజనీష్‌ బి లోక్‌నాథ్‌, దాశరధి శివేంద్ర, పాయల్‌ రాజ్‌పుత్‌, నందితా శ్వేత, నిర్మాత సురేష్‌వర్మలను ఈ పోస్ట్‌లో ట్యాగ్‌ చేశారు. 

‘మంగళవారం’ సినిమాకు మొదటి నుంచి ఎంతో మంది సెలబ్రిటీల సపోర్ట్‌ లభిస్తూనే ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి అల్లు అర్జున్‌ హాజరై యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సమంత సోషల్‌ మీడియా ద్వారా, సక్సెస్‌ మీట్‌లో విశ్వక్‌సేన్‌ ‘మంగళవారం’ టీమ్‌కి అభినందనలు తెలిపారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైన ఈ సినిమాను త్వరలోనే హిందీలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...