మరో ఘోర రోడ్డు ప్రమాదం...12మంది మృతి

 

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హర్మద ఏరియాలోని సికర్ రోడ్డులో వాహనలపై డంపర్ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా 50 మందికి గాయాలయ్యాయి. అతి వేగంతో వచ్చిన ట్రక్కు నియంత్రణ కోల్పోయి ఎదురు వస్తున్న వాహనాలను ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాదాపు 5 కి. మీ. మేర వాహనాలను ఢీకొడుతూ వెళ్లింది. 

ట్రక్కు డ్రైవర్ మద్యం సేవించినట్లు తెలుస్తోంది.రోడ్డుపై వాహనాల శిథిలాల కింద అనేకమంది చిక్కుకున్నారని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని.. కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.  
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu