తెలుగు రాష్ట్రాలకు వానలే వానలు

posted on: Jun 4, 2026 9:17AM

ఉభయ తెలుగు రాష్ట్రాలకూ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది.  భానుడి భగభగలతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాలలో రానున్న ఐదు రోజులూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.   ఎండలు, ఉక్కపోతతో సతమతమవుతున్నప్రజలకు ఈ వర్షాలు ఉపశమనం కలిగిస్తాయి.    రానున్న 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.  

  పశ్చిమ ఉత్తరప్రదేశ్ మీదుగా  ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో మధ్యప్రదేశ్ నుండి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉత్తర తమిళనాడు వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఏపీ తెలంగాణలలో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.   

ఇప్పటికే  ఏపీలో   పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలుల ధాటికి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. రాబోయే 24 గంటల్లో నైరుతి మరియు ఆగ్నేయ అరేబియా సముద్ర ప్రాంతాలు, లక్షద్వీప్ దీవులు, కేరళతో పాటు పొరుగు రాష్ట్రమైన తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు వేగంగా విస్తరించనున్నాయి. ఇవి క్రమంగా ఏపీ వైపు కదలనుండటంతో రానున్న రోజుల్లో ఎండల తీవ్రత గణనీయంగా తగ్గనుంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...