ఆస్ట్రేలియాను వరుణుడు కూడా టెన్షన్ పెడుతున్నాడు!

posted on: Feb 17, 2026 4:06PM

టి20 వరల్డ్ కప్ లో సూపర్ 8 దశకు చేరాలంటే ఆస్ట్రేలియా తాను ఆడాల్సిన తదుపరి మ్యాచ్ గెలవడమొక్కటే సరిపోదు. మంగళవారం జింబాబ్వే జట్టు ఐర్లాండ్ చేతిలో ఓడిపోవాలి. అయితే జింబాబ్వే, ఐర్లాండ్ ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ఒక వేళ ఏదైనా కారణం చేత రద్దైనా ఆస్ట్రేలియా సూపర్ 8 ఆశలు వదులు కోవాల్సిందే. ఎందుకంటే మ్యాచ్ రద్దైనా, గెలిచినా జింబాబ్వే నేరుగా సూపర్ 8కు వెళ్లిపోతుంది. అంటే ఐర్లాండ్ తో మ్యాచ్ జరిగి, జింబాబ్వే ఓడిపోతేనే ఆసీస్ సూపర్ 8 ఆశలు సజీవంగా ఉంటాయన్న మాట.  జింబాబ్వే, ఐర్లాండ్ మ్యాచ్ కు ఇప్పుడు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. టాస్ జాప్యమైంది. పల్లెకల మైదానంలో కవర్స్ కప్పి ఉన్నాయి. వర్షం జోరుగా పడుతోంది.

వర్షం కారణంగా మ్యాచ్ రద్దౌతుందేమోనన్న ఆందోళనతో ఆస్ట్రేలియా ఉంది. ఒక వేళ ఓవర్లు కుదించైనా మ్యాచ్ జరిగితే ఐర్లాండ్ విజయం సాధిస్తుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే జింబాబ్వే జట్టు అద్భుత ప్రదర్శన ఇస్తోంది. ఇప్పటికే బలమైన ఆసీస్ జట్టపై అలవోక విజయం సాధించింది. సపోజ్ ఫర్ సపోజ్ జింబాబ్వే ఐర్లండ్ చేతిలో ఓడిపోయినా ఆసీస్ తదుపరి మ్యాచ్ గెలిచినా సూపర్ 8 కు నేరుగా వెళ్లే అవకాశాలు లేవు. అప్పుడు రన్ రేట్ ఇంపార్టెంట్ అవుతుంది.

ప్రస్తుతానికి గ్రూప్ బిలో జింబాబ్వే మెరుగైన రన్ రేట్ తో ఉంది. ఎలా చూసినా ఈ సారి వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా సూపర్ 8కు చేరే అవకాశాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి.   నేపథ్యంలోనే జింబాబ్వే, ఐర్లండ్ మ్యాచ్ జరుగుతుందా? జరిగితే ఫలితంఎలా ఉంటుంది అన్న ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో ఉంది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...