Latest News

తెలంగాణకు వర్ష సూచన: మూడు రోజులపాటు వానలే వానలు

posted on: Mar 28, 2026 10:16AM

ఈ వేసవి నిప్పుల గుండమేనన్న హెచ్చరికలు వెలువడుతున్నాయి. ఎల్ నినో కారణంగా వేసవిలో భానుడి ప్రతాపం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. మార్చి మొదటి వారం నుంచే సూర్యప్రతాపం తన ప్రభావం చూపడం మొదలు పెట్టింది. అటువంటి వేళ..  తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది.   రాష్ట్రవ్యాప్తంగా రానున్న మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 30 వరకూ   తేలికపాటి నుంచి  ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయయని పేర్కొంది. 

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో   తెలంగాణతో పాటు  ఆంధ్రప్రదేశ్ లోనూ వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.  అకాల వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, వాతావరణ శాఖ పలు జిల్లాలకు  ఎల్లో అలర్ట్  జారీ చేసింది. కాగా వానలతో పాటు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే  అవకాశం ఉంది. అలాగే కొన్ని ప్రాంతాలలో పిడుగులు పడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.  పొలాల్లో పనిచేసే రైతులు,  గొర్రెల కాపరులు  వర్షం కురిసే సమయంలో సురక్షిత ప్రాంతాల్లో  తలదాచుకోవాలని సూచించింది.  

ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం,  నల్గొండ  జిల్లాలతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇ శుక్రవారం మార్చి 27) సాయంత్రం నుంచే వాతావరణం మారి వర్షం కురిసింది.  శనివారం కూడా హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుందనీ, రాత్రి సమయంలో వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.  కోత దశలో ఉన్న పంటలకు  ఈదురుగాలులతో కురిసే వర్షాల వల్ల భారీ నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   

google-ad-img
    Related Sigment News
    • Loading...