కుప్పంలో రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్ట్

posted on: Feb 18, 2026 10:50AM

చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్  రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్ల హాల్ట్ కు రైల్వే శాఖ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లేఖ రాశారు. వాస్కోడగామా - వేలంకణి మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలును కుప్పం రైల్వే స్టేషన్‌లో  హాల్డ్ కు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నా ఆయన అలాగే  దాదర్ సెంట్రల్ - పాండిచ్చేరి ఎక్స్‌ప్రెస్ రైలును కుప్పం రైల్వేస్టేషన్‌లో నిలుపుదల చేసేందుకు ఆమోదించినట్లు  ఆ లేఖలో పేర్కొన్నారు.

 ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవలి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా  కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి కుప్పం రైల్వే స్టేషన్‌లో ఈ ఎ‌క్స్‌ప్రెస్ రైళ్లకు స్టాపేజ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.   కుప్పం మీదుగా నడిచే దూరప్రాంత ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్టాపేజ్ కోసం స్థానికుల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న విజ్ణప్తులను పరిగణనలోనికి తీసుకుని అందుకు ఆమోదం తెలపాల్సిందిగా చంద్రబాబు రైల్వే మంత్రిని కోరారు.  ఆయన విజ్ణప్తి మేరకు ఈ రెండు రైళ్లకూ కుప్పంలో కూడా స్టాప్ కు అఅనుమతి ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.  దీనిపై రైల్వే  మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...