ముగిసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ త్రిసభ్య కమిటీ విచారణ

posted on: Feb 3, 2026 2:18PM

 

జనసేన రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆ పార్టీ త్రిసభ్య కమిటీ విచారణ చేసింది. రైల్వేకోడూరుకు వెళ్లి ఎమ్మెల్యే నుంచి వివరణ తీసుకుంది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతు నా దగ్గర ఉన్న ఆధారాలను త్రిసభ్య కమిటీకి ఇచ్చా.. కమిటీ నివేదికను బట్టి నా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో నా తెలియదని అని అరవ శ్రీధర్‌ తెలిపారు. దీంతో కమిటీ నివేదిక ఆధారంగా శ్రీధర్‌పై జనసేన అధిష్టానం చర్యలు తీసుకోనుంది. 
 
అరవ శ్రీధర్ తనను చాలా కాలంగా లైంగిక వేధించారని ఓ మహిళ ఆరోపించారు. తనకు ఐదు సార్లు అబార్షన్ చేయించారని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాంగ్రాట్స్‌ చెప్పిన తర్వాత నుంచి తనకు వేధింపులు మొదలయ్యాయని అన్నారు. తర్వాత టెలిగ్రామ‌లో చాటింగ్ చేశారని తెలిపారు. కొన్ని రోజులు బాగానే మాట్లాడిన  తర్వాత శాసన సభ్యుడి అసలు రంగు బయటపెట్టారని ఆరోపించారు. తనను కారులో తీసుకెళ్లి మొదటిసారి తనకు ఇష్టం లేకపోయినా బెదిరించి రేప్ చేశారని బాధితురాలు ఆరోపించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...