Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అరుణాచలం భక్తులకు రైల్వే శాఖ శుభవార్త
posted on: Jun 3, 2026 5:39PM

అరుణాచలంలో అరుణాచలేశ్వరుడిగా కొలువై ఉన్న శివుడ్ని దర్శించుకునే తెలుగు రాష్ట్రాల భక్తులకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. భక్తుల సౌకర్యార్థం చర్లపల్లి-తిరువణ్ణామలై మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు. తమిళనాఢులోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం అరుణాచలాన్ని తిరువణ్ణమలై అంటారు. ఈ మేరకు దక్షిణ రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది.
07001 నంబర్ చర్లపల్లి-తిరువణ్ణామలై ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు.. ఈ నెల 4 నుంచి సెప్టెంబరు 24వ తేదీ వరకు చర్లపల్లిలో సాయంత్రం 5.50 గంటలకు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు తిరువణ్ణామలై చేరుకుంటుంది. అదేవిధంగా మరో మార్గంలో 07002 నంబర్ తిరువణ్ణామలై-చర్లపల్లి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు.. ఈ నెల 5వ తేదీ నుంచి సెప్టెంబరు 26వ తేదీ వరకు తిరువణ్ణామలైలో రాత్రి 11.10 గంటలకు బయల్దేరి మరుసటిరోజు సాయంత్రం 4.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
ఈ రెండు రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి, వేలూరు కంటోన్మెంట్ మీదుగా తిరువణ్ణామలై చేరుకుంటాయి. ఈ రైళ్ల రిజర్వేషన్ బుధవారం నుంచి ప్రారంభమైందని దక్షిణ రైల్వే ప్రకటనలో తెలిపింది.






