Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన గాయకుడు రాహుల్ సిప్లిగంజ్
posted on: Aug 14, 2025 3:46PM

ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సీఎం రేవంత్‌రెడ్డిని ఇవాళ జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల సిప్లిగంజ్‌కు రూ. కోటి నగదు ప్రోత్సాహకం ప్రభుత్వం అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాహుల్‌ను శాలువ కప్పి సత్కరించారు.
కాగా, ఆర్ఆర్ఆర్ సినిమాలో తను పాడిన ‘నాటు నాటు’ సాంగ్‌కు ఆస్కార్ అవార్డు రావడంతో దేశవ్యాప్తంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాపులర్ అయ్యారు. ఆ ఒక్క సాంగ్‌తో ఫ్యాన్స్ మనసు గెలుచుకున్నారు. అయితే, 2023లో ఓ ప్రోగ్రామ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల నగదు ఇస్తామని పీసీసీ అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు జూలై 20న పాతబస్తీ బోనాల సందర్భంగా రాహుల్‌కు తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి ప్రోత్సాహకం ప్రకటించింది. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో రాహుల్‌తో పాటు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తదితరులు ఉన్నారు.






