డీసీసీ అధ్యక్షులకు రాహుల్‌గాంధీ మార్షల్ ఆర్ట్స్ క్లాస్

posted on: Mar 3, 2026 9:26AM

డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. మార్షల్ ఆర్ట్స్ చేస్తూ డీసీసీ అధ్యక్షులకు క్లాస్ చెప్పారు. తాజాగా డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులు విజయవంతంగా జరిగాయి. అనంతగిరి హరితా రిసార్ట్స్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. మార్షల్ ఆర్ట్స్ చేస్తూ డీసీసీ అధ్యక్షులకు క్లాస్ చెప్పారు

జియు జిట్సు అనే మార్షల్ ఆర్ట్‌లో మెళకువలను డీసీసీ అధ్యక్షులకు వివరించారు. మార్షల్ ఆర్ట్స్‌ను వ్యక్తిగత జీవితంలో అన్వయించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ఐడియాలజీపై క్లాస్ చెప్పారు. నాయకులు తమ అహంకారాన్ని పక్కన పెట్టి పని చేయాలని రాహుల్ సూచించారు. ఈగోల కంటే పార్టీ ముఖ్యమని స్పష్టం చేశారు. పార్టీ కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షులు.. మరో పదిమందిని తయారు చేయాలని, పని చేస్తున్న వారిని గుర్తించాలని రాహుల్ గాంధీ అన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...